ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ విధానం అందుబాటులోకి రానుంది.ఈ మేరకు సీఏఆర్డీ 2.0 నేటి నుంచి అమలుకానుంది.రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో సమూల మార్పులు చేస్తూ కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగానే సీఏఆర్డీ 2.0 సాఫ్ట్ వేర్ ను రూపొందించింది.దీని ద్వారా ప్రజలు ఇకపై నేరుగా ఆన్ లైన్ లో దస్తావేజులు తయారు చేసుకునే వెసులుబాటుతో పాటు స్లాట్ బుకింగ్ అవకాశం కల్పించింది సర్కార్.దీంతో వినియోగదారులే వివరాలు నమోదు చేసుకుని ఫీజు చెల్లించుకునేలా కొత్తవిధానంలో వెసులుబాటు కల్పించింది.
రిజిస్ట్రేషన్ పూర్తి అయిన 20 నిమిషాల్లోనే దస్తావేజులు అందనున్నాయి.కాగా ఈ కొత్త రిజిస్ట్రేషన్ విధానం ఈనెల 15 నుంచి పూర్తిస్థాయిలో అమలుకానుందని అధికారులు వెల్లడించారు.