ఏపీలో ప్రజలు అర్ధరాత్రి మెరుపు ధర్నాలు చేస్తున్నారు.విద్యుత్ కోతలతో విసుగెత్తిన ప్రజలు కర్నూలు, బాపట్ల, కోనసీమ మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో రాత్రి సమయంలో నిరసనలకు దిగారు.
ఈ క్రమంలోనే సబ్ స్టేషన్లను ముట్టడించిన ప్రజలు గంటల తరబడి ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.ఈ నేపథ్యంలోనే జగ్గయ్యపేటలో విజయవాడ – హైదరాబాద్ హైవేపై రాస్తారోకో చేశారు.
ఓ వైపు ఉక్కపోత మరోపక్క కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు.అయితే గత రెండు రోజులుగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాత్రి సమయంలో కరెంట్ కోతలు విధిస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.