తెలుగులో తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపును కలిగి ఉన్న సెలబ్రిటీలలో యామీ గౌతమ్( Yami gautam ) ఒకరు.తాజాగా సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమాల్లో నటించే నటీనటుల గురించి ఈ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
యాడ్స్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న యామీ గౌతమ్ ప్రస్తుతం సౌత్ సినిమాలకు దూరంగా ఉన్నారు.సినిమాలను మార్కెటింగ్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె అన్నారు.
ఈ రీజన్ వల్లే చాలామంది నటీనటులు తమ ప్రతిభను చూపించలేకపోతున్నారని యామీ గౌతమ్ వెల్లడించారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో( Bollywood ) మార్కెటింగ్ సంస్కృతి పెరిగిపోతుందని యామీ గౌతమ్ చెప్పుకొచ్చారు.
కొంతమంది ఒక సినిమాతోనే సక్సెస్ సాధిస్తారని మరి కొందరు సక్సెస్ కావడానికి ఎక్కువ సినిమాలు చేయాల్సి వస్తుందని యామీ గౌతమ్ అన్నారు.అయితే కొంతమంది మాత్రం సక్సెస్ కావడం కోసం పబ్లిసిటీపై ఆధారపడతారని ఆమె చెప్పుకొచ్చారు.
ఎవరైతే పబ్లిసిటీ ద్వారా సక్సెస్ కావాలని భావిస్తారో అలాంటి వాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలవడం సాధ్యం కాదని యామీ గౌతమ్ అన్నారు.ఈ మధ్య కాలంలో విభిన్నమైన సినిమాలను ఎంచుకోవడం, వైవిధ్యమైన పాత్రల్లో నటించడం ద్వారా పాపులారిటీని సంపాదించుకోవాలని భావించే వాళ్లతో పోల్చితే పబ్లిసిటీ ద్వారా ఫేమ్ సంపాదించాలని భావించే వాళ్లు ఎక్కువని ఆమె కామెంట్లు చేశారు.
తాను మాత్రం పబ్లిసిటీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వనని యామీ గౌతమ్ పేర్కొన్నారు.ప్రతిభను నమ్మిస్ శ్రమిస్తే సక్సెస్ సులువుగా వస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.యామీ గౌతమ్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం దొరకడం లేదు.ప్రస్తుతం యామీ గౌతమ్ వయస్సు 34 సంవత్సరాలు కాగా ఈమె కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
యామీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా( Social media )లో హాట్ టాపిక్ అవుతున్నాయి.