మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ramcharan ) ప్రస్తుతం ఎలాంటి సినిమాలో షూటింగ్లో పాల్గొనకుండా కేవలం ఇంటి పక్కనే ఉంటున్న విషయం మనకు తెలిసిందే.ప్రస్తుతం శంకర్ ( Shankar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్( Game Changer ) అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అయితేరామ్ చరణ్ గత నెల రోజుల నుంచి ఈ సినిమా షూటింగుకు బ్రేక్ ఇచ్చారు.
అయితే ఈ బ్రేక్ మరికొన్ని రోజులపాటు పొడిగించబోతున్నారని తెలుస్తోంది.దాదాపు ఈయన ఆగస్టు నెల వరకు షూటింగ్ కు లాంగ్ బ్రేక్ ఇచ్చారని సమాచారం.
ఇలా రాంచరణ్ షూటింగుకు విరామం ఇవ్వడానికి కారణం లేకపోలేదు పెళ్లైన పది సంవత్సరాలకు తన భార్య తల్లి కాబోతుండడంతో ఈయన తన పూర్తి సమయాన్ని తన భార్యకే కేటాయించాలని నిర్ణయించుకున్నారట ఈ క్రమంలోనే ఆగస్టు వరకు నో షూటింగ్స్ అంటూ ఈయన షూటింగ్ కు విరామం ప్రకటించారని తెలుస్తుంది.ప్రస్తుతం ఉపాసన ( Upasana ) ఎనిమిదవ నెల గర్భిణీ అయితే ఈమె జులై మొదటి వారంలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారని అందుకే ఎలాంటి సినిమా షూటింగ్ టెన్షన్ లేకుండా రామ్ చరణ్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.
ఇలా సినిమా షూటింగ్లకు బ్రేక్ తీసుకున్నటువంటి ఈయన పూర్తి సమయాన్ని తన భార్య కోసం కేటాయించాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ఇలా పది సంవత్సరాల తర్వాత రాంచరణ్ తండ్రి కాబోతుండడంతో తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఈయన చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇలా తన బిడ్డ భార్య కోసం తన విలువైన సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నారు.అయితే ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్ సినిమా ఆగస్టు తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.
అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.