”PKSDT”.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు.
ఈ సినిమా వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
దీంతో తెలుగులో ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు.పీపుల్స్ మీడియా బ్యానర్ తో కలిసి ఈ సినిమాను త్రివిక్రమ్ (Trivikram) నిర్మింస్తుండగా.
సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహిస్తున్నారు.ఒరిజినల్ వర్షన్ తమిళ్ లో కూడా సముద్రఖనినే డైరెక్ట్ చేసారు.
మరి ఇక్కడ కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే పవన్ స్టార్ తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు.
ఇక మిగిలిన షూట్ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూట్ హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో నైట్ జరుగుతుంది అని తెలుస్తుంది.
థమన్ సంగీతం అందిస్తున్న జులై 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేసారు.ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి తాజాగా నిర్మాత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సాయి తేజ్ (Sai Dharam Tej) నటించిన విరూపాక్ష (virupaksha) పోటీ లేకుండా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతూ బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో పీపుల్స్ మీడియా తరపు నుండి సాయి తేజ్ కు ప్రత్యక అభినందనలు తెలియజేయగా.ఆయన కూడా కృతజ్ఞతలు తెలిపారు.అలాగే తాను పవన్ తో కలిసి నటిస్తున్న సినిమా కోసం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపాడు.
ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మాతల్లో ఒకరైన టిజి విశ్వప్రసాద్ (Vishwa Prasad) సాయి తేజ్ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు.పవన్ గారితో కలిసి మీరు చేస్తున్న మూవీ ఎక్స్పీరియన్స్ ఎప్పటికి మరువలేం అని.(PKSDT ) మూవీ అద్భుతంగా వస్తుంది అని తప్పకుండ రిలీజ్ తర్వాత అందరిని ఆకట్టు కుంటుంది అని ధీమా వ్యక్తం చేసారు.ఈ కామెంట్స్ ఇప్పుడు ఫ్యాన్స్ లో వైరల్ అయ్యాయి.