తాజాగా టీమ్ ఇండియా యువ వికెట్ కీపర్ జితేష్ శర్మ( Jitesh Sharma ) గురించి మనందరికీ తెలిసిందే.జితేష్ శర్మ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా జితేష్ శర్మ బాలీవుడ్ హీరోయిన్స్ అయినా కంగనా రనౌత్, జాన్వీ కపూర్ ( Kangana Ranaut, Janhvi Kapoor )లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా పంజాబ్ కింగ్స్ ఆటగాడు అయిన హర్ ప్రీత్ సింగ్, జితేష్ శర్మ ( Harpreet Singh )ఇద్దరూ కలిసి ఒక చిన్న ఫన్నీ గేమ్ ఆడారు.
ఈ నేపథ్యంలోనే జితేష్,హర్ ప్రీత్,అథర్వలను నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని ప్రశ్నించగా హర్ ప్రీత్,అథర్వలు ఇద్దరు సరైన సమాధానం చెప్పలేకపోయారు.అప్పుడు జితేష్ మాట్లాడుతూ నాకు ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ అంటే ఇష్టం.వారు జాన్వి కపూర్, కంగనా.
వాళ్ళిద్దరినీ నటన పరంగా నేను ఇష్టపడతాను.లుక్స్ పరంగా జాన్వీ కపూర్ కి నేను పెద్ద అభిమానిని అని చెప్పుకొచ్చారు జితేష్ శర్మ.
అనంతరం మాట్లాడుతూ నా ఫేవరెట్ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్( Adam Gill Christ ) అని చెప్పుకొచ్చాడు జితేష్ శర్మ.
తనకు కన్నడ హీరో యష్ నటించిన కేజిఎఫ్ 1, కేజీఎఫ్ 2( KGF1, KGF2 ) సినిమాలు ఇష్టమని తెలిపారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇకపోతే హీరోయిన్ జాన్వీ కపూర్, కంగాన విషయానికి వస్తే.
ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు బాలీవుడ్లో పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం కంగానా రనౌత్ బాలీవుడ్ లో రెండు మూడు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
అలాగే జాన్వి కపూర్ కూడా తెలుగులో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది.అలాగే రామ్ చరణ్ సరసన కూడా నటించే అవకాశం వచ్చింది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.