తెలుగులో ఒకప్పుడు టాప్ యాంకర్ గా కొనసాగింది అనితా చౌదరి. పలు షోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది.
పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందిన అనిత.ఆ తర్వాత సినిమా రంగంలోనూ అడుగు పెట్టింది.
పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.అమృతం, నాన్న లాంటి సీరియల్స్ ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.
చాలా కాలం తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో మళ్లీ వెండితెరపై మెరిసింది అనితా చౌదరి.
అనిత తొలిసారి ఈటీవీలో ప్రసారం అయ్యే కస్తూరి సీరియల్ తో నటిగా తన ప్రస్తావాన్ని మొదలు పెట్టింది.
సుమారు 7 సంవత్సరాల పాటు ఈ సీరియల్ లో కీ రోల్ ప్లే చేసింది.ఇందులో నటనకు గాను ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది.ఆ త్వాత రుతురాగాలు సీరియల్ లోనై ఆమె నటించింది.ఈ సీరియల్ కూడా ఓ రేంజిలో పాపులారిటీ పొందింది.
తిరుగులేని టీవీ ఆర్టిస్టుగా మారిపోయింది అనిత.పలు అవకాశాతో ముందుకు సాగింది.
మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఆ తర్వాత సినిమా రంగంలోకి ఆమె అడుగు పెట్టింది.కామెడీ సినిమాల దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన తాళి సినిమాలో ముందుగా అనితకే హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది.అయితే ఇంటికి దూరంగా ఆరు నెలల పాటు షూటింగ్ ఉంటుందని చెప్పాడు.
దీంతో ఆ అవకాశాన్ని వదులుకుంది అనిత.
ఆ తర్వాత ఓ ఎన్నారైని పెళ్లి చేసుకుంది.ఇటు ఫ్యామిలీతో పాటు సినీ కెరీర్ నూ కొనసాగిస్తుంది.ప్రస్తుతం వీరికి ఓ అబ్బాయి ఉన్నాడు.
సినిమాల్లో అవకాశాల కోసం అనిత ప్రయత్నాలు చేస్తుంది.
ఇప్పటికే మంచి పాపులారిటీ ఉన్న అనితకు సినిమా అవకాశాల సైతం వస్తూనే ఉన్నాయి.మున్ముందు ఆమె మరిన్ని సినిమాలతో పాటు సీరియల్స్ లో నటించి మంచి కెరీర్ కంటిన్యూ చేయాలని కోరుకుందాం.