మొస‌లి వ‌ర్సెస్ సింహం.. గెలిచిందెవ‌రంటే..?

సింహానికి అడవిలో ఉన్న అన్ని జంతువుల కంటే అధిక బలం తెలివి తేటలు ఉంటాయనే విషయం మనం చిన్ననాటి నుంచి వింటూనే ఉన్నాం.

ఈ భూమి మీద ఏ ప్రాణి కూడా సింహం తో పోరు పెట్టుకొని ఓడించదన్న విషయం తెలిసిందే.

కానీ అలాంటి సింహం నీళ్లల్లోకి వెళ్తే.అక్కడ కూడా దాని బలం అలాగే ఉంటుందా.

నీటిలో సింహం ముసలితో పోటీ పడితే ఎవరిని విజయం వరిస్తుంది.భూమి మీదలానే సింహం విజయం సాధిస్తుందా? లేక నీటిలో కాబట్టి ముసలి గెలుస్తుందా.అనే విషయాలు తెలుసుకోవాలంటే కింది వీడియో తప్పక చూడాలి.

వీడియోలో చూపించిన విధంగా ఓ మొసలి నదీ తీరాన విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది.ఆ ప్రదేశానికి వచ్చిన సింహం ఇంతలో మొసలి మీద రెప్పపాటులో దాడి చేస్తుంది.

Advertisement

ఇది గమనించిన మరో రెండు సింహాలు కూడా ముసలిపై దాడికి తెగబడి దానిని ఆహారంగా చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తాయి.సింహాలు తన మీద దాడికి దిగాయనే విషయం గమనించిన మొసలి కూడా వాటి మీద తన శక్తి వంచన లేకుండా పోరాడుతుంది.

కానీ మొసలి ఒక్కటి.సింహాలు మూడు అయ్యే సరికి సింహాలనే విజయం వరిస్తుంది.

ఇలాగే ఉన్న మరో వీడియోలో నదీ తీరాన సేద తీరుతున్న ముసలి వద్దకు వాయువేగంతో దూసుకు వచ్చిన చిరుత దాడి చేస్తుంది.తన దవడలతో మొసలిని ఒడిసి పట్టుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తుంది.కాగా చిరుత దాడి నుంచి తప్పించుకునేందుకు అక్కడున్న మొసలి నీళ్లల్లోకి వెళ్లేందుకు ఎంతలా ట్రై చేసినా ఫలితం ఉండదు.

ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చి వైరల్ గా మారింది.ఇప్పటికే ఈ వీడియోకు దాదాపు 53 వేల వ్యూస్ దాకా వచ్చాయ‌ని తెలుస్తోంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు