మహేష్ బాబు ఎస్.జె సూర్య కాంబినేషన్ లో తెరకెక్కిన నాని అనే ప్రయోగాత్మక సినిమా మహేష్ బాబు అభిమానులకు సైతం నచ్చలేదనే సంగతి తెలిసిందే.
తాజాగా ఎస్.జె సూర్య మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబుకు హిట్ ఇవ్వనందుకు బాధగా ఉందని అన్నారు.
నాని మూవీ రిజల్ట్ నన్ను ఇప్పటికీ హర్ట్ చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.సినిమా రంగంలోకి హీరో కావాలని నేను ఎంట్రీ ఇచ్చానని సూర్య వెల్లడించారు.
అయితే నటుడిగా ఎదగాలనే ఆలోచనతో వచ్చిన నేను అనుకోకుండా డైరెక్టర్ అయ్యానని ఆయన చెప్పుకొచ్చారు.నేను డైరెక్టర్ గా తెరకెక్కించిన ప్రతి సినిమాను ఎంతో ఆసక్తితో ఆ సినిమా స్క్రిప్ట్ ను ప్రేమించి ఉత్సాహంగా తెరకెక్కించానని ఎస్.
జె.సూర్య అన్నారు.అన్ని సినిమాలలా నాని సినిమా కోసం కూడా కష్టపడినా ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోవడంలో తడబడిందని ఆయన పేర్కొన్నారు.
నాని సినిమా రిలీజైన తర్వాత తనతో మాట్లాడుతూ మహేష్ చెప్పిన విషయాలు నన్ను మరింత బాధ పెట్టాయని ఎస్.
జె.సూర్య చెప్పుకొచ్చారు.
మీరు ఈ సినిమాను ఎంతో ఇష్టపడి చేశారనే విషయం నాకు తెలుసని రిజల్ట్ ను పక్కన పెడితే మిమ్మల్ని మీ వర్క్ ను అభిమానిస్తున్నానని మహేష్ తనతో అన్నారని ఎస్.జె.సూర్య వెల్లడించారు.పవన్ కు సక్సెస్ ఇచ్చిన నేను మహేష్ కు హిట్ ఇవ్వలేకపోయానని ఆయన అన్నారు.
మహేష్ కు సక్సెస్ ఇవ్వకపోయినా నాని మూవీ ఫలితం గురించి ఆయన పాజిటివ్ గా స్పందించిన తీరు నన్ను మరింత బాధ పెట్టిందని ఎస్.జె.సూర్య అభిప్రాయపడ్డారు.ఎస్.జె.సూర్య తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఎస్.జె.సూర్య నటించిన వదంతి ప్రముఖ ఓటీటీలో రిలీజ్ కానుండగా ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.