ఆదిపురుష్ కోసం బైక్ మీద ముంబై టు తిరుపతి.. చరిత్రలో తొలిసారి అలా..

Mumbai To Tirupati Adipurush Music Director's Bike Journey, Music Composer Atul, Ajay-Atul, Mumbai, Tirupati, Adipurush

ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘ఆదిపురుష్’( Adipurush ).బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Director Om Raut ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ వండర్ లో కృతి సనన్( Kriti Sanon ) సీత పాత్రలో నటిస్తున్న విషయం విదితమే.

 Mumbai To Tirupati Adipurush Music Director's Bike Journey, Music Composer Atul,-TeluguStop.com

అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.

తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు.

మరో 10 రోజుల్లో గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం మేకర్స్ భారీ ప్రమోషన్స్ కు సిద్ధం అవుతున్నారు.

మరి ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ గా తనవంతు ప్రమోషన్స్ చేయడానికి అజయ్ – అతుల్ సంగీత ద్వయం సిద్ధం అయ్యింది.వీరు బాలీవుడ్ లో బాగా పాపులర్.

మరి ఆదిపురుష్ తో తెలుగులోకి కూడా ఈ సంగీత స్వయం ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Telugu Adipurush, Ajay Atul, Mumbai, Mumbaitirupati, Musiccomposer, Tirupati-Mov

తాజాగా అందుతున్న వార్తల ప్రకారం సంగీత స్వరకర్తలలో ఒకరైన అతుల్ కొత్త ప్రయోగం చేయడానికి సిద్ధం అవుతున్నారట.ముంబై నుండి తిరుపతి వరకు బైక్ మీద వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు అని తెలుస్తుంది.ఆదిపురుష్ మీద ఉన్న ప్రేమతో అతుల్ ఇలా చేయాలని అనుకుంటున్నారట.

జూన్ 6న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న విషయం తెలిసిందే.

Telugu Adipurush, Ajay Atul, Mumbai, Mumbaitirupati, Musiccomposer, Tirupati-Mov

ఈ ఈవెంట్ కు హాజరయ్యేందుకు ఈయన బైక్ మీద తిరుపతి బయల్దేరనున్నాడట.తిరుపతి( Tirupati ) చేరుకున్న తర్వాత ఆయన సోదరుడు అజయ్ తో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన పాదాల వద్ద జై శ్రీరామ్ సాంగ్ ను సమర్పించనున్నారు.ఇక వీరికి ఘన స్వాగతం పలికేందుకు ప్రభాస్ అండ్ టీమ్ తిరుపతిలో రెడీగా ఉంటారట.

మరి చరిత్రలో తొలిసారి ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినిమాపై ఉన్న ప్రేమను చాటుకో బోతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube