గతేడాది విడుదలై ప్రేక్షకుల మెప్పు పొందిన సినిమాలలో 777 చార్లీ( 777 Charlie ) మూవీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
తెలుగులోకి డబ్ అయిన ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను సైతం ఎంతగానో మెప్పించింది.అడ్వంచర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.
ఈ సినిమాలో కుక్క యాక్టింగ్ ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఏడిపిస్తుంది.
బడ్జెట్ తో పొంతన లేకుండా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.
పెట్ లవర్స్ ( Pet lovers )కు ఈ సినిమా ఎంతగానో నచ్చింది.దాదాపుగా 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమ ప్రపంచవ్యాప్తంగా 105 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.
ఈ సినిమాలో రక్షిత్ శెట్టి ( Rakshit Shetty )నటన కూడా అద్భుతంగా ఉంటుంది.ఈ మూవీలో తన అద్భుతమైన నటనతో రక్షిత్ శెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

అయితే ఈ సినిమాలో నటించిన కుక్కకు బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు రావడం గమనార్హం.చిత్తారా మీడియా( Chittara Media ) ఇచ్చిన అవార్డులలో కుక్క అవార్డ్ గెలుచుకోవడం గమనార్హం.స్టేజ్ పైకి వచ్చి కుక్క అవార్డును తీసుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఒక కుక్కకు అవార్డ్ రావడం ఈ సినిమా విషయంలోనే జరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ కుక్క లాబ్రాయిడ్ జాతికి( Labroid ) చెందిన కుక్క కావడం గమనార్హం.రాబోయే రోజుల్లో కుక్కలకు సంబంధించిన కథలతో సినిమాలు వస్తే ఈ కుక్కకు మరిన్ని ఆఫర్లు రావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.777 చార్లీ మూవీ వెండితెరపై మాత్రమే కాదు బుల్లితెరపై కూడా మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుని సక్సెస్ సాధించింది.కుక్క అవార్డ్ తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.