విశాఖలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ లో భాగస్యామ్యం అయినందుకు సంతోషంగా ఉందని వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ అన్నారు.ఎన్నో రంగాల్లో నిపుణులు ఏపీ నుంచే ఉన్నారని తెలిపారు.
తిరుపతి, విశాఖతో పాటు సహజవనరులు ఉన్న అద్భుత రాష్ట్రం ఏపీ అని ముఖేశ్ అంబానీ కొనియాడారు.ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ఏపీ ముందుందన్నారు.సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు.
సంస్కృతి, సంప్రదాయాలకు ఏపీ నిలయమన్న అంబానీ దేశంలో జియో 5జీ ఓ విప్లవమని వెల్లడించారు.సీఎం జగన్ సమర్థ నాయకత్వంలో ఏపీలో జియో నెట్ వర్క్ వేగంగా అభివృద్ధి చెందిందని కొనియాడారు.