టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గత ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారడంతోపాటు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్.
అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ని ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే.

గత వారం రోజులుగా రాంచరణ్ అక్కడే ఉంటున్నారు.నేపథ్యంలోని ఇటీవల గుడ్ మార్నింగ్ అనే అమెరికా షోలో చెర్రీ పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే.అంతేకాకుండా అమెరికన్ పాపులర్ టాక్ షోలో పాల్గొనడంతో మెగా అభిమానులు, ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేశారు.కాగా ప్రస్తుతం అమెరికాలో ఉన్న రామ్ చరణ్ అక్కడ అవార్డుల్లో కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఏ స్టేజ్ పై కనిపించినా కూడా చెర్రీ ధరించిన సూట్స్ పైనే అభిమానుల కన్నులు పడుతున్నాయి.అంతే కాకుండా చెర్రీ ధరించిన దస్తులపైనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా నడుస్తున్నాయి.ఈ క్రమంలోనే అభిమానులు నెటిజన్స్ రామ్ చరణ్ ధరించిన సూట్స్ ఎక్కడ తయారు చేశారు వాటి డిజైనర్ ఎవరు? వాటి ధర ఎంత?

అన్న విషయంపై ఆరా తీయగా అందుకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే రామ్ చరణ్ వేసుకున్న సూట్స్ చెన్నైకి చెందిన ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రత్యేకంగా రూపొందించినట్లుగా తెలుస్తోంది.చెర్రీ ధరించిన ఒక్కొక్క సూట్ ధర దాదాపుగా 13 లక్షల నుంచి 70 లక్షల వరకు కూడా ఉంటుందని తెలుస్తోంది.ఇక చెర్రీ ధరించిన ఆ సూట్స్ ద్వారా తెలిసి అభిమానులు ఒక్కసారిగా నోరేళ్ళ పెడుతున్నారు.
వామ్మో ఒక్కొక్క సూట్ ధర అన్ని లక్షల అంటూ షాక్ అవుతున్నారు.ప్రస్తుతం చరణ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.







