Meenakshi Chaudhary : అసభ్యకరంగా లేకపోతే అలాంటి సీన్లు అయినా చేస్తాను.. మీనాక్షి చౌదరి కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మీనాక్షి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Meenakshi Chaudhary Shared Screen With Superstar Mahesh Babu In Guntur Karam Mo-TeluguStop.com

అందులో భాగంగానే మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాతో తాజాగా ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమాలో మీనాక్షి పాత్ర నిడివి చాలా తక్కువ అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు విడుదల తర్వాత మీనాక్షి పేరు సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తోంది.గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమా తర్వాత ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది మీనాక్షి చౌదరి.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Tollywood-Movie

మొదట ఇచ్చట వాహనములు నిలుపు రాదు అనే సినిమాతో పరిచయమైన ఈమె ఆ తర్వాత ఖిలాడి, హిట్ 2 లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ. మహేశ్‌బాబు( Mahesh Babu )తో నటించే అవకాశం వచ్చిందని తెలియగానే నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.మొదటిరోజు మొదటి షాట్‌ కూడా ఆయనతోనే చాలా టెన్షన్‌ పడ్డాను.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Tollywood-Movie

నా భయాన్ని గమనించి టెన్షన్‌ పడొద్దనీ, కావాలంటే ఇంకొంత టైమ్‌ తీసుకోమని ధైర్యం చెప్పారు.మహేష్ మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి అని తెలిపింది మీనాక్షి చౌదరి.నా కంఫర్ట్‌.

స్క్రిప్ట్‌ ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా.ముందే చెప్పేస్తాను.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Tollywood-Movie

ఈ కారణంగా నేను పెద్దపెద్ద ప్రాజెక్టులను కూడా వదిలేసుకున్నాను.తెరపై ముద్దులకు సంబంధించి కూడా కొన్ని నియమాలు పాటిస్తాను.స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేసి, మరీ అసభ్యకరంగా లేకుంటే నేను సిద్ధమే! కానీ, కేవలం ముద్దు సీన్ల కోసమే అంటే నేను కచ్చితంగా వద్దని చెబుతాను అని చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి.తెలుగు సినిమా పరిశ్రమ నా పట్ల చాలా ఆప్యాయత చూపుతున్నది.

భాష ఏదైనా మంచి సినిమాలు చేయాలని నా కోరిక.అందుకోసమే ఆచితూచి ఎంచుకుంటున్నాను.

డబ్బు కంటే ముఖ్యంగా నేను చేసే పనికి ప్రశంసలతో పాటు గౌరవం దక్కాలని కోరుకుంటున్నాను అని ఆమె తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube