జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఫ్లెక్సీ వార్ కలకలం రేపుతోంది.అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ల మధ్య ఫ్లెక్సీలకు సంబంధించి వివాదం చెలరేగింది.
ఇందులో భాగంగానే రెండు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది.భూపాలపల్లిలో మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీ ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని కట్టేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రయత్నించాయి.
ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ అడ్డుకుంది.ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగి తోపులాటకు దారి తీసింది.
దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాల నేతలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.