ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) వైరల్ అవుతున్న ఓ డాగ్స్ కంపైలేషన్ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది.ఈ వీడియోలో కుక్కలు(Dogs) అచ్చం మనుషులు మాట్లాడినట్లే అరుస్తూ ఉండటం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.
వీటిని చూసిన వారు తెగ నవ్వుకుంటున్నారు.అంతేకాదు కుక్కల ప్రతిభకు ఆశ్చర్యపోతున్నారు.
కుక్కలు మనుషులు మాట్లాడినట్లే చేస్తున్న ‘సౌండ్స్’ మీరు విన్నా నోరెళ్లబెడతారు.
ఈ వైరల్ వీడియో చేస్తే మనకు ముందుగా ఒక గోల్డెన్ రెట్రీవర్ కుక్క ‘మామ్మ’(mama) అని పిలుస్తున్నట్లుగా అరుస్తుంది.
అది చూస్తుంటే ఒక చిన్న పిల్లాడు తన తల్లిని పిలిచినట్లుగానే అనిపిస్తుంది.తర్వాతి సన్నివేశంలో మరో కుక్క ‘వేర్ ఆర్ యూ గోయింగ్?’ అని అడుగుతున్నట్లుగా అరుస్తూ ఉంటుంది.కుక్కలు మనుషుల మాటల్ని అనుకరిస్తున్నట్లుగా అరుస్తుండటం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియోలోని ప్రతి కొత్త సన్నివేశం ప్రేక్షకులను ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది.
ఈ వీడియోలోని ఒక భాగం మిగతా వాటికంటే చాలా ఆకట్టుకుంటుంది.ఆ పార్ట్‌లో యజమాని తన కుక్కతో ” ఐ లవ్ యు” అని చెప్పగానే, ఆ కుక్క(Dog) అదే మాటల్ని అనుకరిస్తూ అరుస్తుంది.మరో ఫన్నీ సీన్‌లో, జర్మన్ షెపర్డ్‌ను కూర్చోమని ఆజ్ఞాపించినప్పుడు, అది గట్టిగా “లేదు” అని అరుస్తూ నిరాకరిస్తుంది.దాని అరుపు, ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఎవరికైనా నవ్వు రాక తప్పదు.
వీడియోలోని మరో భాగంలో, షిహ్‌ట్జు అనే చిన్న కుక్క తన యజమానితో సరదాగా మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది.మరో కుక్క తన యజమాని ఇటు రావే అని పిలిచినప్పుడు “హౌ అబౌట్ నో”(“How About No”) అని తిరస్కరించడం చూడవచ్చు.ఈ వీడియో ప్రతి ఒక్కరినీ నవ్వులతో ముంచెత్తింది.కామెంట్స్ సెక్షన్‌లో నెటిజన్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, కుక్కలను మనుషులతో పోల్చారు.ఒకరు, “ఇంతకంటే క్యూట్ అయిన మరో వీడియో నేను ఇంతవరకు చూడలేదు!” అని అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ వీడియో చూసిన చాలా మంది తమ రోజు మంచిగా గడిచిందని పేర్కొన్నారు.
ఒకరు, “నేను ఇవాళ చూసిన అతి ఉత్తమమైన వీడియో ఇదే!” అని అన్నారు.ఈ హిలేరియస్, క్యూటెస్ట్ వీడియోను మీరు కూడా చూసేయండి.