సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల పరిధిలో ఉన్న అక్రమ లే అవుట్లను గుర్తించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రియాంక అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆర్డీవో కార్యాలయం హుజూర్ నగర్ లో మున్సిపల్ కమిషనర్లు తహసిల్దార్లతో సమావేశం నిర్వహించారు.
అక్రమలే అవుట్ల పరిశీలన కోసం తహసిల్దార్ మరియు సర్వేయర్లతో టీమ్ లని ఏర్పరచి ఆర్డీవో పర్యవేక్షించాలని ఆదేశించారు.
లేఔట్లలో కమ్యూనిటీ కోసం కేటయించిన 10 శాతం స్థలంలో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో హుజూర్ నగర్,నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్లు, హుజూర్ నగర్,గరిడేపల్లి తహసిల్దార్లు,మట్టంపల్లి డిటి,టి.పి.బి.ఓ,మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.