బంగ్లాదేశ్ లోని ఢాకా వేదికగా న్యూజిలాండ్-బంగ్లాదేశ్( New Zealand-Bangladesh ) మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో ఏకంగా 86 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది.అయితే ఈ మ్యాచ్ లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనకు క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు.
బంగ్లాదేశ్ జట్టు తన క్రీడా స్ఫూర్తిని చాటుకుంది.మ్యాచ్ మధ్యలో ఏం జరిగిందంటే.
రన్ అవుట్ అయ్యి పెవిలియన్( Pavilion ) కు వెళ్తున్న న్యూజిలాండ్ బ్యాటర్ ను బంగ్లాదేశ్ జట్టు వెనక్కు పిలిచింది.అక్కడ ఏం జరుగుతుందో కొంత సమయం వరకు చూసే ప్రేక్షకులకు అర్థం కాలేదు.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుని 167 పరుగులకే ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.అయితే న్యూజిలాండ్ జట్టు ఆల్ రౌండర్ ఇష్ సోధి( Ish Sodhi ) జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా.
కివీస్ ఇన్నింగ్స్ 46వ ఓవర్ వేసేందుకు బంగ్లా జట్టు పేసర్ హసన్ మహమూద్ సిద్ధమయ్యాడు.
హసన్ మహమూద్ తొలి బంతిని వేసేందుకు ముందుకు వస్తూ.నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ ఇష్ సోధి ని రన్ అవుట్ (మన్కడింగ్) చేశాడు.బంతి వెయ్యక ముందే సోధి క్రీజు దాటడం గమనించిన మహమూద్ బంతిని డెలివరీ చేయకుండా స్టంప్స్ పడగొట్టాడు.
ఆ తర్వాత రన్ అవుట్ కు అప్పీల్ చేయగా.నిబంధనల ప్రకారం థర్డ్ అంపైర్ అవుట్ ప్రకటించడంతో నిరాశతో సోధి మైదానం వీడుతుండగా.బంగ్లాదేశ్ జట్టు తమ క్రీడా స్ఫూర్తిని చాటుకుంది.బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్( Captain Liton Das ), జట్టు ఆటగాళ్లు అంపైర్లతో చర్చలు జరిపి సోధి ను వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నారు.
ఆ తర్వాత హసన్ మహమూద్ పరుగులు తీసి సొధి ను వెనక్కి పిలిచాడు.దీంతో సోధి సంతోషంతో హసన్ ను కౌగిలించుకున్నాడు.
దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు బంగ్లాదేశ్ క్రీడా స్ఫూర్తి కి ఫిదా అయ్యారు.ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ జట్టు 86 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.