జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan ) ప్రస్తుతం వారాహి యాత్రను తాత్కాలికంగా ముగించారు.మొన్నటి వరకు విశాఖలో వారాహి యాత్ర నిర్వహించి వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు .
ముఖ్యంగా ఋషికొండ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా పవన్ ప్రసంగాలు చేశారు.పవన్ సభలకు భారీగా జనాలు హాజరవుతూ ఉండడంతో, జనసేన లోను ఉత్సాహం పెరిగింది.
ఎన్నికలకు కొద్ది నెలల మాత్రమే సమయం ఉండడంతో, పవన్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతారని అంత భావించారు.కానీ పవన్ రాజకీయ యాత్రలకు బ్రేక్ ఇచ్చారు.
ప్రస్తుతం పెండింగ్ లో పవన్ సినిమాలు ఉండడంతో, వాటిని పూర్తిచేసే పనిపైన ఫోకస్ పెట్టారు.సినిమా షూటింగ్స్ పూర్తికాగానే ఆయన పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి సినిమాలన్నీ పూర్తి చేసి నవంబర్ నుంచివారాహి యాత్ర చేపట్టనున్నారట .ప్రస్తుతం పవన్ నటిస్తున్న ఓజీ సినిమా( OG movie ) షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది.
ఇప్పటికే అరవై శాతం షూటింగ్ కూడా పూర్తి కావడంతో, సినిమాల పైనే దృష్టి సారించారు.రన్ రాజా రన్ , సాహో చిత్రాల దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి అక్టోబర్ లో 20 రోజులు, నవంబర్ లో ఎనిమిది రోజులు పాటు నటించేందుకు పవన్ డేట్స్ ఇచ్చారట.షూటింగ్ కి గ్యాప్ ఉన్న రోజుల్లో అవకాశాన్ని బట్టి ఏపీలో పర్యటించేందుకు పవన్ ప్లాన్ చేసుకుంటున్నారు.
నవంబర్ నుంచి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాలని పవన్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం టిడిపి ( TDP party ) పొత్తుల వ్యవహారం చర్చల దశలో ఉంది.
వీలైనంత త్వరగా దానిని ఒక కొలిక్కి తెచ్చి జనసేన ( Janasena )ను మరింతగా జనాల్లోకి తీసుకు వెళ్లే విధంగా పవన్ ప్లాన్ చేసుకుంటున్నారట.