సుడిగాలి సుదీర్ ( Sudigali Sudheer ) తో కలిసి పోవే పోరా షో తో బుల్లితెర పై ఒక్కసారిగా యాంకర్ గా ఫేమస్ అయ్యింది విష్ణు ప్రియ.ఈ షో తర్వాత విష్ణు ప్రియ కి ఎన్నో అవకాశాలు వచ్చాయి.
ఆ తర్వాత టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా మారినప్పటికీ ఆ తర్వాత ఈ యాంకర్ కి అంతగా అవకాశాలు రాలేవనే చెప్పుకోవచ్చు.యాంకర్ గా అవకాశాలు లేకపోయినప్పటికీ తన హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియా లో కుర్రకారును ఉర్రూతలూగించింది.
అంతే కాకుండా కొన్ని ప్రైవేట్ సాంగ్స్ లో కూడా చేస్తుంది.ఇక ఈ మధ్య కాలంలో జె.డి చక్రవర్తి కీలక పాత్ర పోషించిన దయ( Dayaa ) అనే వెబ్ సిరీస్ లో ఒక కీలకమైన పాత్ర లో యాంకర్ విష్ణు ప్రియ ( Vishnupriya ) నటించింది.
ఈ వెబ్ సిరీస్ విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకు పోతుంది.అయితే ఈ వెబ్ సిరీస్ లో విష్ణు ప్రియ ని తీసుకోవడానికి కారణం అదే అంటూ ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ పవన్ సాదినేని తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ లో అసలు విషయం బయట పెట్టారు.పవన్ సాధినేని( Pavan Sadhineni ) మాట్లాడుతూ.
నేను అనుకున్న పాత్రకి తగ్గట్టుగా యాంకర్ విష్ణు ప్రియ నాకు అనిపించింది.
అయితే ఈ పాత్ర కి నటన కంటే ఎక్కువగా ఫిజిక్ ఉండాలి.అందుకే ఆమె ఫిజిక్ ని చూసి ఆమెకు ఈ వెబ్ సిరీస్ లో అవకాశం ఇచ్చాను అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు.అంతేకాదు పరోక్షంగా విష్ణుప్రియ( Vishnupriya ) కి నటన రాకపోయినా పర్వాలేదు ఆమె ఫిజిక్ చూసి మాత్రమే అవకాశం ఇచ్చాను అంటూ ఈయన మాట్లాడడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అలాగే ఈ వెబ్ సిరీస్ లో చాలా రోజుల తర్వాత జెడి చక్రవర్తి ( J.D.Chakravarthy ) కీలక పాత్రలో కనిపించారు.