ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణం..!

ప్రపంచ సీనియర్ చాంపియన్ షిప్( Senior Champion Ship ) లో ఎన్నో ఏళ్లుగా స్వర్ణ పతకం కోసం ఎదురుచూస్తున్న భారత్ కల ఎట్టకేలకు నెరవేరింది.2017, 2021 ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ షిప్( Archery Championship ) లలో ఫైనల్ చేరిన భారత జట్టు రజక పతకాలతో సరిపెట్టుకుంది.ఈసారి మాత్రం స్వర్ణ పతకం గెలిచి భారత్ తన సత్తా ఏంటో నిరూపించింది.ప్రపంచ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో భారత్ 12 పతకాలను సొంతం చేసుకుంది.

 Gold For India In World Archery Championship , World Archery Championship, Mexic-TeluguStop.com

ఇందులో 1 స్వర్ణ పతకం, 9 రజత పతకాలు, 2 కాంస్య పతకాలు ఉన్నాయి.విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ( Jyoti Surekha ), మహారాష్ట్రకు చెందిన అదితి స్వామి, పంజాబ్ కు చెందిన పర్ణిత్ కౌర్ త్రయం గురి.

భారతదేశానికి తొలి స్వర్ణం అందించారు.ఆర్చరీ ఏ విభాగంలో అయినా దేశానికి ఇదే తొలి పసిడి పతకం.

Telugu Jyoti Surekha, Latest Telugu, Mexico, Senior Ship-Sports News క్ర

తాజాగా శుక్రవారం బెర్లిన్( Berlin ) లో జరిగిన కాంపౌండ్ మహిళల జట్టు విభాగం ఫైనల్ లో రెండో సీడ్ భారత జట్టు 235-229 తేడాతో టాప్ సీడ్ మెక్సికో పై గెలిచింది.మొదటినుండి తమకంటే బలమైన జట్లను ఓడిస్తూ ఫైనల్ కు చేరిన భారత అమ్మాయిలు.ఫైనల్ పోరులో కూడా అదే జోరు కొనసాగించారు.మెక్సికో పటిష్టంగా ఉన్నా కూడా చివరి వరకు పట్టు వదలకుండా అద్భుత ఆటను ప్రదర్శించి స్వర్ణం గెలిచారు.మెక్సికో పై తొలి రౌండు భారత్ ఆధిపత్యం చెలాయించింది.తొలి రౌండులో 60 కి 59 స్కోర్ చేశారు.

రెండో రౌండ్లో, మూడో రౌండ్ లోను 59 చొప్పున పాయింట్లు సాధించారు భారత అమ్మాయిలు.చివరి రౌండుకు ముందు భారత్ 177-172 ఆధిక్యంలో నిలిచింది.

Telugu Jyoti Surekha, Latest Telugu, Mexico, Senior Ship-Sports News క్ర

ఇక చివరి రౌండ్ చివరి సెట్ కు ముందు భారత్ 207-199 తో ముందంజలో ఉండగా.చివరి సెట్ లో మెక్సికో( Mexico ) అర్చర్లు ముగ్గురు పదేసి చొప్పున పాయింట్ సాధించడంతో స్కోరు 229 కి చేరింది.ఇక భారత అర్చర్లలో పర్ణిత్ 10 పాయింట్లు, అదితి 9 పాయింట్లు సాధించారు.భారత్ గెలవడానికి మరో ఐదు పాయింట్లు అవసరం ఉండగా.తెలుగమ్మాయి సురేఖ ఏకంగా 9 పాయింట్లు సాధించింది.దీంతో ప్రపంచ ఛాంపియన్ గా భారత్ నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube