దేవరకొండ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు

నల్లగొండ జిల్లా: దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ పై రోజు రోజుకు సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.ఇటీవల దేవరకొండ మున్సిపల్ కౌన్సిలర్ హనుమంతు వెంకటేష్ గౌడ్ ఎమ్మెల్యేపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే.

 The Own Party Leaders Rebelled Against Devarakonda Mla, Own Party Leaders , Deva-TeluguStop.com

అది మరవక ముందే గత బుధవారం గుత్తా వర్గానికి చెందిన దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో డిండి మండలం రుద్రాయగూడెంలోని వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గులాబీ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు,యువజన సంఘం నేతలు సుమారు 150 మంది రహస్య సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాకొద్దంటూ, దేవేందర్ నాయక్ మా ఎమ్మెల్యే అభ్యర్ధి అంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

దీనితో దేవరకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు కిందకు నీళ్ళు వచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సొంత పార్టీ నేతల ధిక్కార స్వరంతో నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా,దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్న రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ నాయకత్వం మీద వివిధ మండలాల్లో అసమ్మతి రాగం తారస్థాయి చేరడంతో పార్టీ శ్రేణులకు ఆయనపై ఉన్న విశ్వాసం పూర్తిగా సన్నగిల్లుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

ఈ సమావేశంలో దేవరకొండ ఎంపీపీ నల్లగాసు జానీ యాదవ్, మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహులు, బీఆర్ఎస్ నాయకులు దొంతిని నరసింహారావు, యాదగిరిరావు,వెంకట్ రెడ్డి,హనుమంతు రెడ్డి, భాస్కర్ రెడ్డి,దశరథ రెడ్డి, చంద్రారెడ్డి,యువజన నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.అసమ్మతివాదుల వాదన ఏమిటి…? 2014,2018 ఎన్నికల్లో తామంతా కలిసికట్టుగా పనిచేసి రెండుసార్లు రవీంద్ర కుమార్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మమ్మల్ని పక్కన పెట్టేసి ఇటీవల పార్టీలో చేరిన వాళ్లకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని,ఇంత కాలం ఓపిక పట్టినా కనీసం మమ్ముల్ని పట్టించుకోవడం లేదని అంటున్నారు.సిట్టింగ్ లకే మళ్ళీ సీటు ఇస్తానన్న కేసీఆర్ ప్రకటనతో తాము తీవ్ర మనోవేదనకు గురయ్యామని,అందుకే పార్టీ అధిష్టానం రవీంద్ర కుమార్ కు మూడోసారి టికెట్ ఇస్తే ఓటు వేసే ప్రసక్తి లేదని,అందరం ఒక్కటిగా నిలిచి ఎమ్మెల్యేను ఓడించి తీరుతామని కరాఖండీగా చెబుతున్నారు.

పార్టీ కోసం గెలిపిస్తే కేవలం డిండి మండలంలో ముగ్గురు నాయకుల కోసమే ఆయన పనిచేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామానికి రూ.20 లక్షల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేస్తే,ఇటీవల పార్టీల చేరిన వారికి పది లక్షల వరకు తమ ప్రమేయం లేకుండానే ఇస్తున్నారని సర్పంచులు వాపోతున్నారు.పంచాయతీ రాజ్ అధికారులను అడగ మీ ఎమ్మెల్యే చెప్పారని చెప్పడంతో చేసేదేమీలేక చేతులు కట్టుకొని కూర్చున్నామని,మా గ్రామ అభివృద్ధి కోసం డంపింగ్ యార్డ్,స్మశాన వాటికలను వాళ్ళు నిర్మిస్తే మా అప్పులు ఎలా తీరుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల పార్టీలో చేరిన వారి మెప్పుకోసం ఇలా చేయడం సబబుకాదని, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ టికెట్ రవీంద్ర కుమార్ ఇస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నవారికైనా ఓటు వేస్తాం కానీ,రవీంద్ర కుమార్ కు ఓటు వేయమని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube