సూర్యాపేట జిల్లా:ప్రస్తుత విద్యా సంవత్సరానికి ముందే ప్రభుత్వం ఉపాధ్యాయుల ప్రమోషన్లు,బదిలీలు చేపట్టాలని ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు ( Kathi Venkateshwarlu )ప్రభుత్వాన్ని కోరారు.మంగళవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ కళాశాల ఆవరణలో ఎంఈఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లెనిన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యాఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ…ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు,ప్రమోషన్లు చేపట్టాలని,అదేవిధంగా గ్రామాల్లో మాదిగ విద్యార్థుల విద్య పట్ల చైతన్యం కలిగించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ సాధన కొరకు మందకృష్ణ మాదిగ( Mandakrishna Madiga ) ఆదేశాలకనుగుణంగా సంఘ సభ్యులు పనిచేయాలన్నారు.రేపు మునగాల మండలంలో మహానయులైన అంబేద్కర్,జగ్జీవన్ రామ్, మహాత్మ జ్యోతిరావు పూలే,బుద్ధుడు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ మందకృష్ణ మాదిగ హాజరవుతున్న సందర్భంగా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం కోదాడ పట్టణంలో ఎంఈఎఫ్ సభ్యత్వ నమోదు,సంఘ కార్యాలయ ఏర్పాటువంటి అంశాలపై తీర్మానం చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఏపూరి పర్వతాలు,నియోజకవర్గ నాయకులు పులి వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి పాతకోట్ల ప్రకాష్,అన్నపంగు లచ్చయ్య,వీరభద్రం, గంధం రంగారావు,గంధం బుచ్చారావు,ఇరుగు కిరణ్,భిక్షపతి, వెంకటేశ్వర్లు, తమలపాకుల సైదులు తదితరులు పాల్గొన్నారు.