రైతుకు న్యాయ సలహాలపై అవగాహన సదస్సు...!

నల్గొండ జిల్లా:రైతు అంటే మట్టిని చిదిమి ఆహారంగా మార్చి ప్రజలందరికి అందించేవాడని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు( M.Nagaraju ) అన్నారు.శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలోని రైతు వేదిక నందు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ న్యాయ న్యాయ సలహాలు, సూచనలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

 During The Lunar Eclipse On The Night Of May 5 These Are The Real Reasons For Pl-TeluguStop.com

ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ పాడిపంటలను అన్ని రకాలుగా సమగ్ర ప్వ్యవసాయం ఇప్పుడు ఎవరు చేయట్లేదని, ఆవులు,మేకలు పశు సంవర్దన పెంపకాలు మర్చిపోయారని అన్నారు.పంట వేసినప్పటి నుండి పురుగు మందులు వేసి పంటలు పండిస్తున్నారని,నీటి ఆధారిత పంటలు కాకుండా నీరు లేకుండా పండించే పంటలు కాలానికి అనుగుణంగా పండే పంట మార్పిడిని ఎన్నుకొని సాగుచేయాలని సూచించారు.

ప్రతి మండలానికి నలుగురు పారా మెడికల్( Para medical ) వ్యవసాయ అధికారులు ఉంటారని, వారు పంట వివరాలు తెలియజేస్తారని,ఎలాంటి పంటలైన ఏ విధంగా పండించాలి,తెగుళ్లకు ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలో వివరిస్తారని చెప్పారు.ఏ అంశం మీదనైనా అవగాహన లేకపోతే రైతులు ఈ సదస్సులో తెల్సుకోవచ్చన్నారు.

కాలానికి అనుగుణంగా పంటలను ఎన్నుకోని వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకొని పండించాలన్నారు.ఈ అగ్రి క్లినిక్ ను ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలి కోరారు.

ఈ కార్యక్రమంలోడి ఎల్ఎస్ఎస్ సెక్రెటరీ దీప్తి, సీనియర్ సివిల్ జడ్జ్ తేజో కార్తిక్,జూనియర్ సివిల్ జెడ్జ్ శిరీష, అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ హుసేన్ బాబు,రైతులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube