తమ ముఖ చర్మం తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని చాలా మంది ఆరాటపడుతుంటారు.ముఖ్యంగా మగువలు తెల్లటి మెరిసే చర్మం కోసం ఖరీదైన స్కిన్ వైట్నింగ్ క్రీమ్ లను కొనుగోలు చేసి వాడుతుంటారు.
తరచూ బ్యూటీ పార్లర్ కి వెళ్లి స్కిన్ బ్లీచ్, ఫేషియల్ తదితర వాటిని చేయించుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే చర్మాన్ని తెల్లగా మార్చుకునేందుకు వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే స్కిన్ ను వైట్ గా బ్రైట్ గా మెరిపించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే మూడు పదార్థాలు అద్భుతంగా సహాయపడతాయి.
మరి ఆ పదార్థాలు ఏంటి.వాటిని ఎలా ఉపయోగించాలి.అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక చిన్న బీట్ రూట్ ( Beet root )ను తీసుకుని తొక్క తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.
ఈ తురుము నుంచి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.అలాగే చిన్న కీర దోసకాయ( Cucumber )ను కూడా తీసుకొని సన్నగా తురుముకొని జ్యూస్ ను సెపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు చందనం పొడి( Sandalwood powder ) వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ కీర దోసకాయ జ్యూస్ మరియు రెండు టేబుల్ స్పూన్లు బీట్ రూట్ జ్యూస్ వేసుకుని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
రోజుకు ఒకసారి ఈ విధంగా కనుక చేస్తే చందనం పొడి, బీట్ రూట్, కీరా దోసకాయ లో ఉండే ప్రత్యేక సుగుణాలు చర్మ ఛాయను మెరుగు పరుస్తాయి.కొద్ది రోజుల్లోనే మీ స్కిన్ వైట్ గా మారడాన్ని మీరు గమనిస్తారు.ఈ రెమెడీని పాటించడం వల్ల బ్రైట్ అండ్ వైట్ స్కిన్ మీ సొంతం అవుతుంది.పైగా ఈ రెమెడీ వల్ల చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా మాయమవుతాయి.
స్కిన్ స్మూత్ గా ఫ్రెష్ గా సైతం మారుతుంది.