టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో అక్కినేని అఖిల్( Akhil Akkineni ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తండ్రి, తాతల హోదాతో ఇండస్ట్రీకి అడుగు పెట్టాడు.
కానీ వాళ్లు తెచ్చుకున్నంత గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోతున్నాడు.ఇప్పటికీ పలు సినిమాలలో హీరోగా చేసినా కూడా ఆయనకు మాత్రం స్టార్ హోదా అనేది రాలేకపోతుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆయన వ్యక్తిగతం గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అఖిల్ చిన్న వయసులోనే సిసింద్రీ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.ఆ సమయంలో కేవలం ఒక్క సంవత్సరం వయసులో ఉన్నాడు అతడు.ఇక ఆ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత విదేశాలలో చదువులు పూర్తి చేసుకొని 2014లో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీకి రిఎంట్రీ ఇచ్చాడు.2014లో డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో విడుదలైన మనం సినిమాలో( Manam Movie ) చివర్లో క్లైమాక్స్ లో మాత్రమే కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు.
ఆ తర్వాత 2015 లో అఖిల్ సినిమాతో( Akhil ) హీరోగా పరిచయమయ్యాడు.కానీ ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేక పోయింది.నిజానికి తన తొలి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు అని అక్కినేని ఫ్యామిలీ అనుకున్నారు.
కానీ తొలి సినిమా అని ఊహించని షాక్ ఇచ్చింది.ఆ తర్వాత ఆటాడుకుందాం రా సినిమాలో అతిధి పాత్రలో కూడా చేశాడు అఖిల్.
ఇక 2017లో హలో సినిమాలో నటించగా ఈ సినిమా కొంతవరకు పరవాలేదు అన్నట్లుగా టాక్ తెచ్చుకుంది.ఆ తర్వాత మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలలో నటించగా ఈ సినిమాలు కూడా అఖిల్ ను నిరాశపరిచాయి.
నిజానికి అఖిల్ రీఎంట్రీ తో ఏ ముహూర్తంలో అడుగుపెట్టాడో కానీ అప్పటినుంచి ఈయనకు సక్సెస్ అనేది లేకపోయింది.
దీంతో అప్పటినుంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు అఖిల్.ప్రస్తుతం ఆయన ఏజెంట్ సినిమాలో( Agent Movie ) నటించగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.దీంతో అఖిల్ ఆశలు అన్ని ఈ సినిమా పైనే ఉన్నాయి.
ఇక ఈ సినిమా కూడా ప్లాఫ్ అయితే మాత్రం అఖిల్ కు హీరోగా కలిసి రానట్లే అర్థం.
ఇక అఖిల్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.
తన ప్రాజెక్టు అప్డేట్ ల గురించి షేర్ చేస్తూ ఉంటాడు.అయితే అఖిల్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన గతంలో.
తను ప్రేమించిన అమ్మాయి శ్రీయ భూపాయ్ తో ఎంగేజ్మెంట్ జరుపుకోగా ఆ తర్వాత అది క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటివరకు వారి ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయిందన్న విషయం గురించి క్లారిటీగా ఎవరికి తెలియలేదు.
అయితే తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసింది శ్రీయ భూపాల్( Shriya Bhupal ) అని తెలిసింది.ఎంగేజ్మెంట్ తరవాత తనకు ఈ పెళ్లి వద్దని చెప్పిందట.అయితే దానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది.ఓ ఫంక్షన్ లో అఖిల్, శ్రీయ గొడవపడ్డారట.అంతే కాకుండా ఓ సారి ఎయిర్ పోర్ట్ లో కూడా ఇద్దరూ గొడవపడ్డారట.
ఆ సమయంలో శ్రీయ తల్లి కూడా పక్కనే ఉన్నారట.ఇక తన కూతురుపై అఖిల్ ఫైర్ అవ్వడంతో ఆమె కూడా కోపడ్డారని తెలిసింది.
ఇక అఖిల్ కు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలియడం వల్లనే ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిసింది.అదే కాకుండా.అఖిల్ ఓ ఫేమస్ బ్యాట్మింటన్ ప్లేయర్ తో సీక్రెట్ గా లవ్ ఎఫైర్ నడిపిస్తున్నాడని శ్రీయ కు తెలిసిందట.అలా ఆ అమ్మాయి వల్ల ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయిని వదులుకున్నాడు అఖిల్.
ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అతని వదిలేసి పోవడంతో ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నాడు.మొత్తానికి ఇద్దరమ్మాయిలు ఆయనకు పెద్ద దండం పెట్టేసారని అర్థమవుతుంది.