బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) ఏ పార్టీలో చేరబోతున్నారనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్థికంగాను , సామాజిక వర్గంగా బలమైన నేతగా గుర్తింపు పొందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని తమ తమ పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి కాంగ్రెస్ లు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి .
ఆయన కోరిన కోరికలన్నీ తీర్చేందుకు సిద్ధమవుతున్నాయి.పొంగులేటిని చేర్చుకోవడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ ప్రభావం చూపించవచ్చని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.
టిఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు బలమైన క్యాడర్ ఉన్న పొంగులేటిని చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి .
ఈ విషయంలో బిజెపి దూకుడుగా ఉంది.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలో చేరితే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని, అన్ని రకాలుగా అండదండలు అందిస్తామని బిజెపి హై కమాండ్ పెద్దల నుంచి రాష్ట్ర నాయకుల వరకు ఆయనకు హామీలు ఇస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.అయినా పొంగులేటి మాత్రం ఇంకా ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు.
అయితే గతంలో వైసిపి నుంచి ఎంపీగా గెలిచిన పొంగులేటి ఇప్పటికి జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి .
ఏపీలోనూ అనేక కాంట్రాక్టులు శ్రీనివాస్ రెడ్డి చేస్తున్నారు.ఇక బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్ తో పొంగులేటి అనేకసార్లు సమావేశం అయ్యారు. తాజాగా మరోసారి జగన్ తో భేటీ పొంగులేటి భేటీ అయ్యారు.
ఏ పార్టీలో చేరాలనే విషయంలో జగన్ క్లారిటీ ఇచ్చారట.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేరడమే మంచిదని జగన్ సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ అగరనేత రాహుల్ గాంధీ టీమ్ తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చించారట.ఈ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టు విక్రమార్క, పోదెం వీరయ్య నియోజకవర్గాలు మినహా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి సూచించిన వారికి టిక్కెట్లు ఇచ్చేందుకు తాము సిద్దమని రాహుల్ గాంధీ టీమ్ స్పష్టం చేసిందట.
ఇదే విషయాన్ని జగన్ వద్ద పొంగులేటి ప్రస్తావించగా, ఖమ్మం జిల్లాలో ఎలాగూ బిజెపికి బలం లేదు.కాబట్టి అక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ లో చేరితేనే మంచిదని జగన్ సూచించారట.అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కీలకంగా మారవచ్చు అని జగన్ పొంగులేటికి సూచించారట.దీంతో బిజెపిలో చేరాలని ముందుగా భావించిన పొంగులేటి జగన్ సూచన మేరకు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇక పొంగులేటి బాటలోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) కూడా వెళ్ళబోతున్నారట.