తెలుగులో ఒకప్పుడు ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీలో ప్రసారమయ్యే “అంతఃపురం” అనే ధారావాహిక లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీరియల్ నటి లహరి గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటి “బాబీ లాహిరి” అవకాశాల పరంగా బాగానే రాణించినప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులను, కష్టాలను ఎదుర్కొంది.
కాగా ప్రస్తుతం బాబీ లహరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు.కాగా గత కొద్దికాలంగా బాబీ లాహిరి కొడుకు కొంతమేర మానసికంగా బాధపడుతున్నాడు.
దీంతో తాజాగా నటి బాబీ లహరి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన కొడుకు మానసిక స్థితి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఇందులో భాగంగా తన కొడుకు పుట్టినప్పుడు ఆసుపత్రి యాజమాన్యం డబ్బు కోసం లేదా ఇతర కారణాల వల్ల అనవసరంగా ఐసియులోని వెంటిలేటర్ పై ఉంచడం మరియు అనవసరమైన ఇంజక్షన్లను ఇవ్వడం వంటివి చేయడంతో తన కొడుకు జీవితం ఇలా తయారయిందని వాపోయింది.
అంతేకాకుండా ఈ విషయంపై అప్పట్లో ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తన ఆవేదన వ్యక్తం చేసింది.అలాగే తొందర్లోనే తన కొడుకుకి ఇలా కావడానికి కారణమైన ఆసుపత్రి పేరు మరియు ఇతర వివరాలను బయటపెడతానని తెలిపింది.
మన జీవితంలో ఎన్ని ముఖ్య బంధాలు ఉన్నప్పటికీ బాధ్యతలు మాత్రం కన్న తల్లిదండ్రులకు మాత్రమే ఎక్కువగా ఉంటుందని అందువల్లనే తన కొడుకు జీవితం కోసం ఆసుపత్రి యాజమాన్యంతో పోరాడుతున్నానని తెలిపింది.
ఇక తన సీరియల్ జీవిత విషయానికొస్తే తాను ఇప్పటి వరకు చాలా సీరియల్స్ లో నటించినప్పటికీ “అంతఃపురం” సీరియల్ తనకు ఆల్ టైం ఫేవరెట్ అని చెప్పుకొచ్చింది.అంతేకాకుండా ఆ సీరియల్ లో తన నటన చూసి తనకి చాలా గర్వంగా ఉంటుందని తెలిపింది.అలాగే ఆ ధారావాహికలో నటించినప్పుడు తన పాత్రలో లీనమైపోయి ఒక్కోసారి పాత్రలో నుంచి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడ్డానని కూడా తెలిపింది.