యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘అశ్వధ్ధామ’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.ఈ సినిమాతో తన ఖాతాలో ఛలో వంటి మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను వేసుకోవాలని చూస్తున్నాడు ఈ హీరో.
అయితే ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని కూడా లైన్లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు నాగశౌర్య.
అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీలో ఓ వార్త హల్చల్ చేస్తోంది.
ఈ సినిమా స్టోరీలైన్ ఇదేనంటూ ఓ వార్త చిత్రపురిలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో హీరో వివిధ సందర్భాల్లో తన ప్రేమను వ్యక్తం చేసే కథను ఈ సినిమాలో మనకు చూపించనున్నారు చిత్ర యూనిట్.
ఈ సినిమాను దర్శకుడు కమ్ యాక్టర్ శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ఊహలు గుసగుసలాడే, జ్యోఅచ్యుతానంద సినిమాలు మంచి విజయాలుగా మిగిలాయి.
ఇప్పుడు వీరి కాంబినేషన్లో రాబోయే మూడో సినిమా హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాని తర్వాత షెడ్యూల్ కోసం యూఎస్‌కు వెళ్లనుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.