ఆర్‌ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పూత్.ఈఅమ్మడు మొదటి సినిమాతోనే ఒక్కసారిగా స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది.
ఆ చిత్రంతో యూత్‌లో యమ క్రేజ్‌ను దక్కించుకుంది.ఆ తర్వాత ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వచ్చాయి.
కాని అందులో ఎక్కువగా బి గ్రేడ్ పాత్రలు అంటే హాట్ సీన్స్‌కు ప్రాముఖ్యత ఉన్న పాత్రలు ఉండటంతో వాటిని కాదనుకుంది.స్టార్ హీరోల సరసన నటించేందుకు ఆసక్తి చూపించింది.
పెద్ద హీరోలు ఈ అమ్మడిని లైట్ తీసుకోగా కొందరు హీరోలు మాత్రం ఈమెకు ఛాన్స్ ఇస్తూ వచ్చారు.ఇప్పటి వరకు చాలా సినిమాల్లోనే ఈమె నటించింది.కాని ఇప్పటి వరకు ఈమె చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఆకట్టుకోలేక పోయింది.ఇటీవలే వచ్చిన వెంకీ మామ చిత్రంలో ఈమె పాత్రకు అసలు ప్రాముఖ్యత లేదు.
ఒకటి రెండు పాటల్లో కనిపించి వెళ్లి పోయింది.ఆ సినిమా నిరాశ పర్చినా కూడా డిస్కోరాజాపై అంచనాలు పెంచుకుని ఈ అమ్మడు వెయిట్ చేసింది.
డిస్కోరాజా నేడు విడుదల అయ్యింది.ఈ చిత్రంలో కూడా ఈ అమ్మడు ఆకులో అరటి పండు అన్నట్లుగా ఉంది.డిస్కోరాజా చిత్రంలో సెకండ్ హాఫ్‌లో ఈ అమ్మడు వస్తుంది.అసలు ఈమె పాత్రకు కథకు సంబంధం లేదు.సినిమాలో ఆమె లేకున్నా కూడా నడుస్తుంది అన్నట్లుగా ఉంది.ఏమాత్రం ఆకట్టుకోక పోవడంతో పాటు పాయల్ రాజ్ పూత్ దారుణంగా ఈ చిత్రంలో కనీసం అందాల విందుకూడా చేయలేదు అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఈ అమ్మడి క్రేజ్ మూడు రోజుల ముచ్చటే అయ్యింది.