వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.పోలీసులు ప్రజాప్రస్థానం పాదయాత్ర నిలిపివేయడంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో తన పాదయాత్రకు అనుమతి ఇచ్చేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ షర్మిల పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ క్రమంలో షర్మిల వేసిన పిటిషన్ పై ధర్మాసనం ఇవాళ విచారణ చేయనుంది.
అయితే ఇటీవలే వరంగల్ సీపీ రంగనాథ్ అనుమతితో వైఎస్ షర్మిల పాదయాత్ర పున: ప్రారంభమైన సంగతి తెలిసిందే.