ఆర్ఎస్ఎస్ భైంసా ర్యాలీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.ఈ మేరకు తెలంగాణ హైకోర్టు అనుమతిని ఇచ్చింది.
శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా ర్యాలీలో ఐదు వందల మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు సూచించింది.
మసీద్ కు సుమారు మూడు వందల మీటర్ల దూరంలో ర్యాలీ నిర్వహించాలని చెప్పింది.నేర చరిత్ర లేని వారే ర్యాలీలో పాల్గొనాలన్న ధర్మాసనం ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేసింది.