డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, నార్మల్ స్కిన్ అన్ని చర్మ తత్వాలకు సెట్ అయ్యే గంధం పేస్ పాక్స్

గంధంను ముఖ సౌందర్యంలో చాలా పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు.గంధం అనేది డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, నార్మల్ స్కిన్ ఇలా అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది.ఇప్పుడు ఏ చర్మ తత్త్వం ఉన్నవారు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

1.జిడ్డు చర్మం గలవారు

కావలసిన పదార్ధాలు
గంథం పొడి – అరస్పూన్
ముల్తాని మట్టి – అరస్పూన్
రోజ్ వాటర్ – 2 స్పూన్స్

 Sandalwood Face Packs For Different Skintypes-డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, నార్మల్ స్కిన్ అన్ని చర్మ తత్వాలకు సెట్ అయ్యే గంధం పేస్ పాక్స్-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎలా ఉపయోగించాలి

ఒక బౌల్ లో గంధం పొడి,ముల్టానా మట్టి,రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖం మీద జిడ్డు సమస్య తొలగిపోతుంది.

2.పొడి చర్మం

కావలసిన పదార్ధాలు
గంధం పొడి – అరస్పూన్
కొబ్బరినూనె – 1 స్పూన్

ఎలా ఉపయోగించాలి

కొబ్బరినూనెను గోరువెచ్చగా చేసి దానిలో గంధం కలిపి ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే పొడి చర్మ సమస్యలు తగ్గిపోతాయి.

3.సాధారణ చర్మం

కావలసిన పదార్ధాలు
దోసకాయ రసం – 2 స్పూన్స్
గంధం పొడి – 1 స్పూన్

ఎలా ఉపయోగించాలి

దోసకాయ రసంలో గంధం పొడిని కలిపి ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మంపై వచ్చే మొటిమల సమస్యలు తగ్గిపోతాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు