మొదటి నుంచి గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూనే వస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ ( YCP )ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని ధీమాగా చెబుతోంది.ఏపీలో అధికారంలోకి రాబోయేది తామేనని, ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారని, జగన్ పార్టీని ఇంటికి పంపడం ఖాయమని పదే పదే ప్రచారం చేస్తున్నారు.
మొన్నటి వరకు విపక్ష పార్టీలను ఇరుకున పెట్టె విధంగా వైసిపి విమర్శలు చేసింది.ఏపీలో పెద్ద ఎత్తున అమలవుతున్న సంక్షేమ పథకాల విషయంలో కూటమి పార్టీలు పెద్దగా విమర్శలు చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయాయి.
వీటిపై విమర్శలు చేసినా, జనాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో డైలమాలో పడ్డాయి.అయితే అనూహ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెరపైకి తెచ్చాయి.
ఈ వ్యవహారం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.పదేపదే టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ( Chandrababu , Pawan Kalyan )ఈ చట్టంపై వైసీపీని విమర్శిస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
టిడిపి( TDP ) అనుకూల మీడియాలోనూ ఈ చట్టంపై కథనాలు పెద్ద ఎత్తున వస్తూ ఉండడం, అవి జనాల్లోకి వెళ్తుండడంతో, వైసిపి డైలమాలో పడింది.వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, వాటిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటుందని, ప్రజల ఆస్తులు వారికి చెందకుండా పోతాయని, ప్రజల ఆస్తులకు సంబంధించి ఒరిజినల్ ద్రౌపత్రాలు ప్రభుత్వం వద్దే ఉంటాయని ప్రజలు కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
పాస్ బుక్ ల పైన.రిజిస్ట్రేషన్ దస్తావేజుల పైన జగన్ బొమ్మ ఇప్పటికే వేసుకున్నారని, ప్రతిపక్ష నేతలు గుర్తు చేస్తున్నారు.మన తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తులపైన జగన్ బొమ్మ ఏమిటని నిలదీస్తున్నారు.ఆ ఆస్తులు ఏమైనా ప్రజలకు జగన్ ఇచ్చాడా ? జగన్ తండ్రి, తాత ఇచ్చారా అంటూ నిలదీస్తున్నారు.ఈ విమర్శలు జనాల్లోకి బాగా వెళ్లడం తో దీనిపై వైసిపి వివరణ ఇచ్చుకుంటోంది.ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తాము తయాలేదని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిందని కౌంటర్ ఇస్తున్నారు.
ఇప్పటికే 24 రాష్ట్రాల్లో ఈ చట్టం అమలైందని, అక్కడ ప్రజల ఆస్తులు ఎవరైనా లాక్కున్నారా అని నిలదీస్తున్నారు.
ఏపీలో ఇంకా ఈ చట్టం అమలు కావడం లేదని, ఈ చట్టం మంచిది కాకపోతే అసెంబ్లీలో బిల్లుకు టిడిపి ఎందుకు మద్దతు పలికిందో చెప్పాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది కాదని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే తీసుకువచ్చిందని, ఈ చట్టం మంచిది కాదనే విషయాన్ని బిజెపి నేతలతోనే చెప్పించాలని వైసీపీ సవాల్ చేస్తుంది.అంతేకాదు ఆస్తులు కొని.
రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారితో తమ అనుకూల మీడియాలో వైసిపి ప్రచారం చేయిస్తుంది.తాము ఆస్తులు కొన్నామని .ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇచ్చారని వారితోనే చెప్పిస్తోంది.ఇక బిజెపి నేత.మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ వి ఆర్ కృష్ణారావు వంటి వారు కూడా ల్యాండ్ టైటిలింగ్ చట్టం బిజెపి తెచ్చిందేనని చెబుతుండడాన్ని వైసీపీ హైలెట్ చేస్తోంది.