ఈ మధ్యకాలంలో ప్రజలు బయట మనుషులతో జీవించే కంటే సోషల్ మీడియాలో ఎక్కువ జీవిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.చాలామంది స్మార్ట్ ఫోన్ మాయలో పడిపోయి ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా సమయం గడిపేస్తున్నారు.
ఇకపోతే సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు యువత హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి కాదు.వ్యూస్ కోసం అలాగే లైక్స్ కోసమో అంటూ లేనిపోని సాహసాలు తెచ్చి చివరికి కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలిస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వైరల్ గా మారిన వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
ఈ వీడియో చూసిన వారు యువకడు( young man ) చేసిన సాహసం చూసి నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు.వీడికి ప్రాణం విలువ అసలు తెలియదంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.ఈ వీడియోలో ఓ యువకుడు తన ఇంస్టాగ్రామ్ రీల్ కోసం రన్నింగ్ లో ఉన్న రైలు పైకి ఓ యువకుడు ఎక్కి నానా హంగామా చేయబోయాడు.కదులుతున్న రైలు పైకి ఎక్కి రకరకాల భంగిమలు ఇవ్వసాగాడు.
అంతేకాదు., రైలు పైకి ఎక్కి ఆపై కూడా వింత చేష్టలు చేయబోయాడు.
అంతే ఉన్నట్టుండి రైలు ( train )పైన ఉన్న హై టెన్షన్ వైర్ తగలడంతో పెద్ద మంటతో దెబ్బకు మాడి మసయ్యాడు.ఈ దెబ్బతో ట్రైన్ మీదే ప్రాణాలు విడిచి విగత జివిగా పడిపోయాడు.
అయితే ఆ యువకుడు చేసిన విన్యాసాలను మరొకరు మొబైల్లో షూట్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ సంఘటన గుజరాత్ లోని నవయార్డ్ ( Navyard in Gujarat )సమయపంలో చోటుచేసుకుంది.యువకుడు రైలు పైకి ఎక్కగానే కెమెరాకు ఫోజులు ఇవ్వడం మొదలుపెట్టాడు.అలా ఫోజులిస్తున్న సమయంలోనే అనుకోకుండా తలకు ఎలక్ట్రికల్ కేబుల్ తాకగానే.
, విద్యుత్ ఘాతానికి గురై రైలు మీదనే పెద్ద మంటలు ఏర్పడి అక్కడికక్కడే మరణించాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పది మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ అసలు ఇలా చేయడం అవసరమా అంటూ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.మరికొందరైతే ఇలాంటి వారికి అసలు ప్రాణం విలువ తేలేదంటూ మండిపడుతున్నారు.