గబ్బర్ సింగ్ లో పోలీస్ పాత్రకు ఆ ఫ్లాప్ సినిమా స్పూర్తి.. పవన్ హిట్ మూవీ వెనుక కథ ఇదే!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటించిన చిత్రం గబ్బర్ సింగ్( Gabbar Singh ).ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

 Unknown Facts About Pawan Kalyan Starrer Gabbar Singh, Pawan Kalyan, Sardar Gabb-TeluguStop.com

సమ్మర్ లో అయినా కూడా కలెక్షన్ల సునామీని సృష్టించింది.ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగులు వేరే లెవెల్ అని చెప్పవచ్చు.ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.2012 మే 11న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.అయితే ఈ సినిమా విడుదల అయ్యి నేటికి 12 ఏళ్లు పూర్తి అయ్యింది.

ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మరి కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.

మరి ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ సినిమాలో నటించేందుకు మొదట పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించలేదట.

గబ్బర్ సింగ్‌ చిత్రాన్ని తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని పవన్‌ తెలిపారు.దబాంగ్‌ రీమేక్‌ ( Dabangg Remake )నేను చేస్తే బాగుంటుందంటూ ఆ చిత్రం విడుదలైన 2- 3 నెలల తర్వాత నాకు చూపించారు.

అది చూశాక ఇలాంటి సినిమాలో నేనెలా నటించాలో నాకు అర్థం కాలేదు.ఈ చిత్ర కథనమంతా సల్మాన్‌ఖాన్‌ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఉంటుంది.

Telugu Pawan Kalyan, Reject, Sardargabbar, Tollywood, Pawankalyan-Movie

చాలా సినిమాల్లో చూపించినట్టు ఇందులోనూ తల్లి, కొడుకు కథే కదా కొత్తదనం ఏముంది? అని అనిపించి, నేను చేయలేను అన్నాను కానీ, కొన్ని రోజుల తర్వాత తక్కువ బడ్జెట్‌లో త్వరగా పూర్తయ్యే ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నా.అదే సమయంలో దబాంగ్‌గుర్తొచ్చి మరోసారి చూశాను.ఆ రీమేక్‌లో నటించేందుకు సిద్ధమయ్యాను.ఈ చిత్రంలోని పోలీసు పాత్ర ఎలా ఉండాలో నేనే డిసైడ్‌ చేశను.ఇందులో హీరో తన వృత్తి పట్ల నిబద్ధతతో ఉంటాడు.కానీ, డ్రెస్సింగ్‌ స్టైల్‌, వ్యవహార శైలి చాలా విభిన్నంగా ఉంటాయి.

గుడుంబా శంకర్‌ లోని ఓ సన్నివేశంలో నేను చేసిన పోలీసు పాత్రను ఇందుకు స్ఫూర్తిగా తీసుకున్నా అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

Telugu Pawan Kalyan, Reject, Sardargabbar, Tollywood, Pawankalyan-Movie

ఈ సినిమాలోని నా పాత్ర పేరు వెంకటరత్నం నాయుడు ( Venkataratnam Naidu )అయినా అందరూ గబ్బర్‌ సింగ్‌.అంటుంటారు.ఈ పేరు పెట్టడానికి కారణం.

ఒకప్పుడు ఓల్డ్‌ సిటీలో ఉన్న ఓ పోలీసు అధికారి.అప్పట్లో అందరూ ఆయన్ను గబ్బర్‌ సింగ్‌ అని పిలిచేవారు.

ఆయన్ను నేను చూశాను.కానీ, పరిచయం లేదు.

ఆ పేరు నాకు చాలా నచ్చింది.అలా ఈ చిత్రంలోని పోలీసు పాత్ర చూశాక దానికి గబ్బర్‌ సింగ్‌ పేరైతేనే సరిపోతుందని ఫిక్స్‌ అయ్యాను అని వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube