గబ్బర్ సింగ్ లో పోలీస్ పాత్రకు ఆ ఫ్లాప్ సినిమా స్పూర్తి.. పవన్ హిట్ మూవీ వెనుక కథ ఇదే!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటించిన చిత్రం గబ్బర్ సింగ్( Gabbar Singh ).

ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.సమ్మర్ లో అయినా కూడా కలెక్షన్ల సునామీని సృష్టించింది.

ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగులు వేరే లెవెల్ అని చెప్పవచ్చు.

ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.2012 మే 11న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

అయితే ఈ సినిమా విడుదల అయ్యి నేటికి 12 ఏళ్లు పూర్తి అయ్యింది.

ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మరి కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.

మరి ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ సినిమాలో నటించేందుకు మొదట పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించలేదట.

గబ్బర్ సింగ్‌ చిత్రాన్ని తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని పవన్‌ తెలిపారు.దబాంగ్‌ రీమేక్‌ ( Dabangg Remake )నేను చేస్తే బాగుంటుందంటూ ఆ చిత్రం విడుదలైన 2- 3 నెలల తర్వాత నాకు చూపించారు.

అది చూశాక ఇలాంటి సినిమాలో నేనెలా నటించాలో నాకు అర్థం కాలేదు.ఈ చిత్ర కథనమంతా సల్మాన్‌ఖాన్‌ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఉంటుంది.

"""/" / చాలా సినిమాల్లో చూపించినట్టు ఇందులోనూ తల్లి, కొడుకు కథే కదా కొత్తదనం ఏముంది? అని అనిపించి, నేను చేయలేను అన్నాను కానీ, కొన్ని రోజుల తర్వాత తక్కువ బడ్జెట్‌లో త్వరగా పూర్తయ్యే ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నా.

అదే సమయంలో దబాంగ్‌గుర్తొచ్చి మరోసారి చూశాను.ఆ రీమేక్‌లో నటించేందుకు సిద్ధమయ్యాను.

ఈ చిత్రంలోని పోలీసు పాత్ర ఎలా ఉండాలో నేనే డిసైడ్‌ చేశను.ఇందులో హీరో తన వృత్తి పట్ల నిబద్ధతతో ఉంటాడు.

కానీ, డ్రెస్సింగ్‌ స్టైల్‌, వ్యవహార శైలి చాలా విభిన్నంగా ఉంటాయి.గుడుంబా శంకర్‌ లోని ఓ సన్నివేశంలో నేను చేసిన పోలీసు పాత్రను ఇందుకు స్ఫూర్తిగా తీసుకున్నా అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

"""/" / ఈ సినిమాలోని నా పాత్ర పేరు వెంకటరత్నం నాయుడు ( Venkataratnam Naidu )అయినా అందరూ గబ్బర్‌ సింగ్‌.

అంటుంటారు.ఈ పేరు పెట్టడానికి కారణం.

ఒకప్పుడు ఓల్డ్‌ సిటీలో ఉన్న ఓ పోలీసు అధికారి.అప్పట్లో అందరూ ఆయన్ను గబ్బర్‌ సింగ్‌ అని పిలిచేవారు.

ఆయన్ను నేను చూశాను.కానీ, పరిచయం లేదు.

ఆ పేరు నాకు చాలా నచ్చింది.అలా ఈ చిత్రంలోని పోలీసు పాత్ర చూశాక దానికి గబ్బర్‌ సింగ్‌ పేరైతేనే సరిపోతుందని ఫిక్స్‌ అయ్యాను అని వివరించారు.

మందులతో పని లేకుండా రక్తహీనత దూరం కావాలంటే ఇలా చేయండి!!