ధూమపానం చేయడం, మద్యపానం సేవించడం లాంటి విషయాలు అందరికీ తెలిసిన చాలా మంది చేసే పనులే.ఇలాంటి అలవాట్ల వల్ల మన డబ్బు వృధా కావడమే కాకుండా.
మన శరీరానికి కూడా అనేక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి.వీటివల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతాయి.
నిజానికి ఇలా చేయడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయన్న విషయాలు మనం ప్రతిరోజు మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉంటాం.అందరికీ పరిస్థితి ఇలా ఉంటే ఓ పెద్దాయనకు మాత్రం ఈ పరిస్థితి వేరేలా ఉంది.
ఈ వ్యక్తి మద్యానికి బానిసై లక్షాధికారిగా మారడంటే మీరు నమ్ముతారా.? నిజమేనండి ఆ వ్యక్తి తన 13వ ఏట నుంచి మద్యం తాగుతు చివరికి ఆ మద్యం తాగడం వల్లే లక్ష్యాధికారి అయ్యాడు.ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
ఇంగ్లాండ్( England ) దేశంలో నివసిస్తున్న 65 ఏళ్ల నిక్ వెస్ట్ 42 ఏళ్లుగా తాను తాగుతున్న బీర్ క్యాన్లను ఓ గదిలో చేరుస్తూ వచ్చాడు.ఈయనకు వివిధ రకాల బీర్ డబ్బాలు సేకరించడం ఓ అలవాటు.ఇలా తనకున్న అభిరుచితో ఏకంగా 10300 డబ్బాలను సేకరించాడు.
నిక్ వెస్ట్( Nick West ) తన 16 వయసులో ఈ సేకరణ మొదలుపెట్టాడు.కాకపోతే ఇది ఏ క్రమంలోని తన స్నేహితులతో కలిసి మద్యం సేవించడం తనకి అలవాటుగా మారిపోయింది.
దాంతో అతడు మద్యానికి బానిస అయ్యాడు.ఒకవైపు అందరితో కలిసి బీరు తాగుతూనే మరోవైపు ఖాళీ బీర్ టిన్స్ ను ఓ గదిలో దాచడం మొదలుపెట్టాడు.
అదే అతని ఆనందానికి కారణం అంటూ అతడు చెప్పుకొచ్చాడు.అయితే రాను రాను తాను సేకరించిన టిన్ క్యాన్స్ సరిపోకపోవడంతో ఐదు గదులున్న మరో ఇంటికి అతడు షిఫ్ట్ అయ్యాడు.
కాకపోతే అక్కడ కూడా స్థలం సరిపోకపోవడంతో చివరికి వాటిని అమ్మటానికి నిశ్చయించుకున్నాడు.నిజానికి అతడు పదవి విరమణ పొందడంతో ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఇందులో భాగంగా అతడు మొదట 6000 బీర్ క్యాన్స్ ను అమ్మగా అతడికి ఏకంగా 13500 డాలర్స్ అనగా మన భారత కరెన్సీలో 14 లక్షల డబ్బులు వచ్చాయి.ఇందుకు కారణం అతడు అమ్మిన బాటిల్స్ లో కొన్ని సంథింగ్ స్పెషల్.ఆ తర్వాత మరోసారి నిక్ మరో 1800 టిన్స్ ను ఇటలీ దేశంలోని ఓ వ్యక్తికి అమ్మగా 12,500 డాలర్స్ అనగా 10 లక్షల పైగా డబ్బులను అందుకున్నాడు.ఇంకా మరికొన్ని పురాతనమైన టిన్స్ తన దగ్గర ఉన్నాయంటూ నిక్ చెప్పుకొచ్చాడు.1936 నాటి ఓ అరుదైన బీర్ తన వద్ద ఉందంటూ సంతోషంగా చెప్పాడు.ఇలా అతడు తాగి పడేసిన టిన్స్ తోనే అతడు లక్షాధికారిగా మారడం ఇప్పుడు అందరిని ఆశ్చర్య వ్యక్తం చేస్తుంది.