విమానాశ్రయాల దగ్గర నివసించడం వల్ల అనేక ప్రమాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.ముఖ్యంగా ఫ్లైట్స్ సౌండ్ వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి.
ఈ శబ్దం బిగ్గరగా ఉంటుంది కాబట్టి ఇళ్ల కిటికీలు కూడా వణుకుతాయి, ప్రతి గంటకు ఒకసారి ప్రశాంతత చెదిరిపోతుంది.ఇటీవల జరిగిన ఒక సంఘటన విమానాశ్రయాలకు దగ్గరగా నివసించడం వల్ల ఎంత ప్రమాదకరమో తెలియజేసింది.
అమెరికాలోని ఉటా రాష్ట్రంలో( Utah ) ఒక మహిళ ఇంట్లో కిటికీలోంచి చూస్తుండగా ఒక భారీ మంచు ముక్క( Ice Chunk ) ఆమె ఇంటి పైకి వచ్చి పడింది.అది ఉదయం 9:30 గంటల సమయం, ఆమె ఇంట్లో వంటగదిలో ఉండగా భారీ శబ్దం విని ఇల్లు అంతా కంపించడం గమనించింది.వెంటనే బయటకు పరుగెత్తి చూస్తే, ఆమె పెంపుడు జంతువుల కోసం ఏర్పాటు చేసిన కొట్టం పైభాగంలో ఒక పెద్ద రంధ్రం, చుట్టూ మంచు ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.దురదృష్టవశాత్తు, ఆమె పెంపుడు మేక( Pet Goat ) ఒకటి ఆ మంచు ముక్క వల్ల గాయపడి మరణించింది.

ఆ మంచు ముక్క బాస్కెట్ బాల్ సైజులో ఉండి నెల మీద పెద్ద గుంతకు దారితీసింది.మొదట ఆ మహిళ ఆ భారీ శబ్దం విని అది బాంబు అనుకుని భయపడింది కానీ, అది ఐస్ ముక్క అని త్వరలోనే తెలుసుకుంది.ఆమె వెంటనే అధికారులకు ఈ సంఘటన గురించి నివేదించింది.తనిఖీ తర్వాత, ఆ మంచు విమానం( Flight ) నుండి పడిందని ధృవీకరించారు.ఇలా ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫెడరల్ ఎవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది.

ఈ సంఘటన ఆ మహిళను తీవ్రంగా కలవరపెట్టింది.ఇప్పుడు ఎప్పుడూ విమానం శబ్దం వినిపించినా ఆమెకు చాలా టెన్షన్‌గా ఉంటుంది.ఇలాంటి సంఘటన మళ్లీ జరుగుతుందేమో అనే భయం ఆమెను వెంటాడుతూ ఉండటం వల్ల ఇంట్లో కూడా భద్రతాభావం లేకుండా పోయింది.
ఇలాంటి ఫ్లైట్ మార్గాల క్రింద నివసించే వారు ఎదుర్కొనే అసాధారణ ప్రమాదాలకు ఇది ఒక గుర్తులా నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు.