ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఇష్టంగా తినే పండ్లలో అరటి పండు ఒకటి.సంవత్సరం పొడుగునా లభించే అరటి పండ్లు తక్కువ ధరకే లభించినా రుచిలోనూ, పోషకాల విషయంలోనూ దానికదే సాటి.
అరటి పండులో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పొటాషియం, విటిమన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి6, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్, ఫైబర్ ఇలా అనేక పోషకాలు నిండి ఉంటాయి.అందుకే రోజుకొక అరటి పండు తీసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
అయితే ఆరోగ్యానికి అరటి పండు ఎంత మేలు చేసినప్పటికీ దానితో జర జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే, కొన్ని కొన్ని సమయాల్లో అరటి పండును తీసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
మరి ఏ ఏ సమయాల్లో అరటి పండు తీసుకోరాదో? ఇప్పుడు తెలుసుకుందాం.
జలుబు, దగ్గు, కఫం, ఆస్తమా సమస్యలతో బాధ పడే సమయంలో అస్సలు అరటి పండు తీసుకోరాదు.
ఎందుకంటే, అరటి పండు ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేసేసి ముప్ప తిప్పలకు గురి చేస్తుంది.

చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపున అరటి పండును తింటుంటారు.కానీ, ఇలా చేయడం చాలా పొరపాటు.ఖాళీ కడుపున అరటి పండ్లు తింటే మెగ్నీషియం మరియు పొటాషియంల స్థాయిలలో అసమతుల్యత ఏర్పడుతుంది.అలాగే అరటి పండిలోని ఆమ్లతత్త్వం వల్ల జీర్ణసంబంధ సమస్యలనూ ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాగే రాత్రి నిద్రించే ముందు కూడా కొందరు అరటి పండును తింటంటారు.కానీ, అలా చేయడం వల్ల మీరు నిద్ర పోవడానికి ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తుంది.
కాబట్టి, నైట్ టైమ్ అరటి పండును ఎవాయిడ్ చేయడమే మంచిది.
ఇక మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే కూడా అరటి పండు తినరాదు.
వెంటనే తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి.భోజనం చేసిన అరగంట, గంట తర్వాత అరటి పండు తీసుకుంటే మంచిది.