మన దేశంలో ప్రతిరోజూ మతసామరస్యాన్ని చాటి చెప్పే ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటుండగా ఆ ఘటనలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. హిందూ దేవాలయం( Hindu temple ) కోసం భూమిని విరాళంగా ముస్లింలు ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.
జమ్మూకశ్మీర్ లో రియాసీ జిల్లాలో( Reasi district in Jammu and Kashmir ) ఈ ఘటన చోటు చేసుకుంది.జిల్లాలోని కాన్సి పట్టా అనే గ్రామంలో పది అడుగుల వెడల్పుతో 1200 మీటర్ల రహదారిని నిర్మిస్తున్నారు.
ఈ గౌరీ శంకర్ ఆలయం ( Gauri Shankar Temple )500 సంవత్సరాల క్రితం నాటి ఆలయం కాగా ఈ ఆలయం కోసం గులాం మహ్మద్, గులాం రసూల్( Ghulam Mohammed, Ghulam Rasool ) అనే ఇద్దరు వ్యక్తులు తమ భూమిని విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచారు.హిందూ దేవాలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లింలను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
త్వరలో ఈ ఆలయానికి రోడ్డును నిర్మించనున్నారని ఈ రోడ్డు కోసం పంచాయితీ నిధులను ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది.

గులాం రసూల్ మీడియాతో మాట్లాడుతూ రోడ్డు సమస్యను సాకుగా చూపించి సమాజంలో చిచ్చు పెట్టడానికి కొందరు ప్రయత్నించారని ఆయన అన్నారు.ఆలయానికి సరైన రోడ్డు మార్గం లేదని రసూల్ చెప్పుకొచ్చారు.కొంతమంది ఇందుకు సంబంధించి విద్వేష ప్రచారాన్ని కూడా నడిపారని రసూల్ వెల్లడించారు.
మత సామరస్యాన్ని కాపాడటానికి రెవిన్యూ అధికారులు, పంచాయితీ సభ్యులు మీటింగ్ నిర్వహించారని ఆయన తెలిపారు.

తమ భూమిలో కొంత భాగాన్ని రోడ్డు కోసం ఇచ్చారని రసూల్ వెల్లడించారు.గులాం రసూల్, గులాం మహ్మద్ ఉచితంగా భూమిని ఇవ్వడాన్ని నెటిజన్లు ఎంతో మెచ్చుకుంటున్నారు.నేటి తరంలో ఎంతోమందికి వీళ్లు స్పూర్తిగా నిలిచారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
గతంలో కూడా మత సామరస్యాన్ని చాటి చెప్పే ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయనే సంగతి తెలిసిందే.ఈ ఘటన నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.







