రష్యాకు దెబ్బమీద దెబ్బ పడుతోంది.. టాటా చెప్పిన మరో ప్రముఖ కంపెనీ!

రష్యా ఏ ముహూర్తాన ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి అమానుష దాడులను చేస్తోందో అప్పటినుండి రష్యాకు పలు దేశాలు వ్యతిరేకంగా మారిపోయాయి.ఈ క్రమంలో రష్యాలో వున్న అనేక విదేశీ కంపినీలు కూడా మూసివేత దిశగా అడుగులు వేస్తున్నాయి.తాజాగా రష్యా దాడులకు నిరసనగా మెక్‌డోనాల్డ్స్‌ షెట్టర్‌ క్లోజ్‌ చేసింది.అవును… ఉక్రెయిన్‌పై అమానుష దాడులను నిరసిస్తూ అమెరికా దిగ్గజ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.రష్యాలో వున్న వ్యాపారాలను మొత్తం అమ్మేస్తున్నట్లు ప్రకటించింది.రష్యా వ్యాప్తంగా ఉన్న 850 రెస్టారెంట్ల అమ్మకాల ప్రక్రియను ప్రారంభించింది.దీని ద్వారా కొన్ని వేలమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు.

 Russia Is Suffering From Blow After Blow   Another Leading Company  Good Bye , M-TeluguStop.com

ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం ఆరంభించిన తర్వాత మాస్కో నుంచి వైదొలుగుతోన్న మరో అతిపెద్ద వెస్ట్రన్ కార్పొరేషన్ ఇది.రష్యాలో వ్యాపారాలు నిర్వహించడమనేది ఇక సాధ్యం కాదని మెక్‌డొనాల్డ్స్ విలువలకు అక్కడ అనుగుణంగా లేదని కంపెనీ వెల్లడించడం కొసమెరుపు.చికాగోకు చెందిన ఈ కంపెనీ మార్చి ప్రారంభంలోనే రష్యాలో స్టోర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు తెలిపింది.

అయితే అప్పటి నుంచి ఆ స్టోర్లలో పనిచేసిన ఉద్యోగులకు శాలరీస్‌ మాత్రం ఇస్తూనే ఉంది.ప్రస్తుతం ఈ వర్కర్లను నియమించుకునే రష్యన్ కొనుగోలుదారు కోసం చూస్తున్నట్టు మెక్‌డొనాల్డ్స్ ప్రకటించింది.

Telugu Bye, Mcdonalds, Russia, Ukrine, Latest-Latest News - Telugu

అయితే ఈ అమ్మకపు ప్రక్రియ అనేది పూర్తయేంతవరకు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామని మెక్‌డొనాల్డ్స్ తెలపడం గమనార్హం.మెక్‌డొనాల్డ్స్‌లో అంకితభావంతో పనిచేసే 62 వేల మంది ఉద్యోగులకు, రష్యన్ సప్లయిర్స్ తాము వైదొలగడం నిజంగా దురదృష్టకరం అని, కానీ వ్యాపారాలు కొనసాగించడం మాత్రం కంపెనీ విలువలకు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.కంపెనీ విలువలకే తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.3 దశాబ్దాల క్రితం మాస్కో మధ్యలో మెక్‌డొనాల్డ్స్ తొలి స్టోర్‌ను ఏర్పాటు చేసిందనే విషయం తెలిసినదే.కాగా నేటితో ఆ శకం ముగిసినట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube