ఆసియా కప్ లో సరికొత్త రికార్డులు సృష్టించిన రోహిత్ శర్మ..!

కొలంబో వేదికగా భారత్-శ్రీలంక( India-Sri Lanka ) మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించి ఫైనల్ కు చేరింది.భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) అద్భుతమైన అర్ధ సెంచరీ తో రాణించడం, కీలక సమయాలలో భారత బౌలర్లు వికెట్లు తీయడం వల్ల 41 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.

 Rohit Sharma , India-sri Lanka ,shahid Afridi ,virat Kohli , Sports ,sourav-TeluguStop.com

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 48 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు చేసి, కొన్ని సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.ఆ రికార్డులు ఏమిటో చూద్దాం.

రోహిత్ శర్మ అద్భుతమైన రెండు సిక్సర్లు బాది ఓ సరికొత్త ఘనత సాధించాడు.ఆసియా కప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించాడు.

ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగిన పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది( Shahid Afridi )ని వెనక్కు నెట్టేశాడు.

Telugu India Sri Lanka, Latest Telugu, Rohit Sharma, Shahid Afridi, Sourav Gangu

షాహిద్ అఫ్రిది 23 ఆసియా కప్ మ్యాచ్లలో 21 ఇన్నింగ్స్ లలో 26 సిక్సర్లు బాది అగ్రస్థానంలో ఉన్నాడు.ప్రస్తుతం ఆ రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు.రోహిత్ శర్మ 26 ఆసియా కప్ మ్యాచ్లలో 25 ఇన్నింగ్స్ లలో 28 సిక్సర్లు కొట్టి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

అంతేకాదు వన్డేలలో పదివేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న రెండో క్రికెటర్ గా నిలిచాడు.

Telugu India Sri Lanka, Latest Telugu, Rohit Sharma, Shahid Afridi, Sourav Gangu

ఈ జాబితాలో విరాట్ కోహ్లీ( Virat Kohli ) 205 ఇన్నింగ్స్ లలో పదివేల పరుగులు చేస్తే.రోహిత్ శర్మ 241 ఇన్నింగ్స్ లలో పదివేల పరుగుల మైలురాయిని చేరాడు.ఈ జాబితాలో మూడవ స్థానంలో సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్, గంగూలీ 263 ఇన్నింగ్స్ లలో ఈ పదివేల పరుగుల మైలురాయిని చేరారు.

అంతేకాకుండా ఆసియా కప్ లో భారత తరఫున అత్యధిక వన్డేలు గెలిచిన సారథులలో 9 విజయాలతో ధోని ప్రథమ స్థానంలో ఉన్నాడు.రోహిత్ శర్మ ఎనిమిది విజయాలతో రెండవ స్థానంలో ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube