ఆసియా కప్ లో సరికొత్త రికార్డులు సృష్టించిన రోహిత్ శర్మ..!

కొలంబో వేదికగా భారత్-శ్రీలంక( India-Sri Lanka ) మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించి ఫైనల్ కు చేరింది.

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) అద్భుతమైన అర్ధ సెంచరీ తో రాణించడం, కీలక సమయాలలో భారత బౌలర్లు వికెట్లు తీయడం వల్ల 41 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 48 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు చేసి, కొన్ని సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆ రికార్డులు ఏమిటో చూద్దాం.రోహిత్ శర్మ అద్భుతమైన రెండు సిక్సర్లు బాది ఓ సరికొత్త ఘనత సాధించాడు.

ఆసియా కప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించాడు.

ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగిన పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది( Shahid Afridi )ని వెనక్కు నెట్టేశాడు.

"""/" / షాహిద్ అఫ్రిది 23 ఆసియా కప్ మ్యాచ్లలో 21 ఇన్నింగ్స్ లలో 26 సిక్సర్లు బాది అగ్రస్థానంలో ఉన్నాడు.

ప్రస్తుతం ఆ రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు.రోహిత్ శర్మ 26 ఆసియా కప్ మ్యాచ్లలో 25 ఇన్నింగ్స్ లలో 28 సిక్సర్లు కొట్టి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

అంతేకాదు వన్డేలలో పదివేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న రెండో క్రికెటర్ గా నిలిచాడు.

"""/" / ఈ జాబితాలో విరాట్ కోహ్లీ( Virat Kohli ) 205 ఇన్నింగ్స్ లలో పదివేల పరుగులు చేస్తే.

రోహిత్ శర్మ 241 ఇన్నింగ్స్ లలో పదివేల పరుగుల మైలురాయిని చేరాడు.ఈ జాబితాలో మూడవ స్థానంలో సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్, గంగూలీ 263 ఇన్నింగ్స్ లలో ఈ పదివేల పరుగుల మైలురాయిని చేరారు.

అంతేకాకుండా ఆసియా కప్ లో భారత తరఫున అత్యధిక వన్డేలు గెలిచిన సారథులలో 9 విజయాలతో ధోని ప్రథమ స్థానంలో ఉన్నాడు.

రోహిత్ శర్మ ఎనిమిది విజయాలతో రెండవ స్థానంలో ఉన్నాడు.

కల్కి కామియో రోల్స్ మీద కామెంట్స్ చేస్తున్న ప్రేక్షకులు… కారణం ఏంటి..?