ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో సీజన్ మారినప్పుడల్లా ఎన్నో రకాల వ్యాధులు సమాజంలో వ్యాపిస్తూ ఉంటాయి.ఇలాంటి అనేక వ్యాధులను దూరం చేసుకుని మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో ప్రకృతిలో ఉన్న ఎన్నో రకాల మూలికలు( Herbs ) ఎంతగానో ఉపయోగపడతాయి.
వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.దీనివల్ల చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
పూర్వకాలంలో మన పూర్వీకులు ఆయుర్వేదాన్ని ఎక్కువగా విశ్వసించేవారు.ఆయుర్వేదం అనేక రకాల రోగాలను నయం చేస్తుందని గట్టిగా నమ్మేవారు.
ఇంగ్లీష్ వైద్యం నయం చేయలేని ఎన్నో సమస్యలను దూరం చేయడంలో ఆయుర్వేదం ఎంతగానో ఉపయోగపడుతుందని ఇప్పటికీ నమ్మేవారు కూడా ఉన్నారు.అయితే సీజన్ లో వచ్చే అనేక వ్యాధులను దూరం చేసి మన రోగనిరొదక శక్తిని పెంచే మూలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే తులసి( Tulasi )ని సర్వరోగ నివారిణి అని చాలామంది పెద్దవారు చెబుతూ ఉంటారు.దీనిలో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి.వీటితో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి.వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ తులసి ఆకులు తింటే నయం చేసుకోవచ్చు.తులసి ఆకులని నేరుగా తీసుకోవడం, టీ చేసుకుని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.అంతేకాకుండా ఒత్తిడి కూడా దూరమవుతుంది.
ఇంకా చెప్పాలంటే త్రిఫల అనేది మూడు ఆకుల కలయిక.ఇది యాంటీ ఆక్సిడెంట్, డీటాక్సీఫైయర్ గా కూడా పనిచేస్తుంది.ఇమ్యూనిటీ( Immunity )ని పెంచడంతోపాటు జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.గోరువెచ్చని నీటిలో దీన్ని కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే అశ్వగంధ( Ashwagandha ) ఆరోగ్యాన్ని మెరుగ్గా మెరుగుపరచడానికే కాకుండా లైంగిక ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.నాడీ వ్యవస్థకు ఇది ఎంతో మంచిది.
అలాగే ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచి ఒత్తిడిని తగ్గించే శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది.అలాగే నిద్ర పట్టేలా చేసి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.