మెడికో ప్రీతి మరణంపై ఆమె తండ్రి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రీతిది ముమ్మాటికీ హత్యేనన్నారు.
ప్రీతికి నిందితుడు సైఫ్ ఇంజక్షన్ ఇచ్చి చంపాడని ఆరోపించారు.ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లే దాకా చూశాడన్నారు.
ఆ తర్వాతే పడిపోయినట్లు నాటకం ఆడాడని మండిపడ్డారు.మర్డర్ ప్లాన్ కు ముందే సైఫ్ పక్కా స్కెచ్ వేశాడని తెలిపారు.
హత్య చేసి ఆత్మహత్యాయత్నంగా చిత్రీకరించారని వాపోయారు.ఈ క్రమంలో నిందితుడు సైఫ్ ను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.