గడప గడపకు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలు తెలుసుకోవడమే అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని అన్నారు బుధవారం సాయంత్రం ఆమె పట్టణంలోని 9వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ న్నారని అన్నారు.
ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో వారి వద్దకు వెళ్లి తెలుసుకోవటం, ఒకవేళ సంక్షేమ పథకాలు అందని యడల వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించటం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమం సందర్భంగా ప్రజలను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
వారి మోహాలలో సంతోషాలు, వెలుగులు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు వారు చూపించే ప్రేమ ఆప్యాయత మరువలేనిదన్నారు