మహిళలకు జియో మార్ట్ గుడ్ న్యూస్ అందించింది.వాట్సాప్‌లో హాయ్ అని పేర్కొనగానే ఇంటికే కిరాణా సరుకులు సరఫరా చేసే సరికొత్త ప్రక్రియ ప్రారంభించింది.
ఈ విషయంలో వాట్సాప్ మాతృ సంస్థ మెటా, రిలయన్స్ జియో మార్ట్ భాగస్వామ్యం ఏర్పరచుకున్నాయి.మెటా ప్లాట్‌ఫారమ్‌ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
భారతదేశంలో జియోమార్ట్‌తో మా భాగస్వామ్యాన్ని ప్రారంభించడం పట్ల తాను సంతోషిస్తున్నట్లు చెప్పారు.వాట్సాప్‌లో ఇది తమ మొట్టమొదటి ఎండ్-టు-ఎండ్ షాపింగ్ అనుభవం అని పేర్కొన్నారు.
రిలయన్స్ సంస్థ దీనిని అధికారికంగా సోమవారం ప్రకటించింది.ఇంతకు మునుపు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయని వారికి కూడా ఈ విధానం చాలా సులభంగా ఉంటుందని తెలిపింది.
మొత్తం కిరాణా సరుకులను సజావుగా బ్రౌజ్ చేయడానికి, కార్ట్‌లో వస్తువులను జోడించి, కొనుగోలు చేయడానికి ఈ సేవలు ఉపయోగపడతాయని పేర్కొంది.వాట్సాప్ యూజర్లు +91 79770 79770కి హాయ్ మెసేజ్ చేయడం ద్వారా JioMartలో షాపింగ్ చేయవచ్చు.
దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడారు.వాట్సాప్ అనుభవంలో జియోమార్ట్ ఆన్‌లైన్ షాపింగ్ మరింత సులువు అవుతుందన్నారు.
రిలయన్స్ రిటైల్ దేశవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులను చేరుకోవాలని చూస్తోందని, వాట్సాప్ సాయంతో చక్కటి ప్లాట్‌ఫారమ్ ఏర్పడిందని పేర్కొన్నారు.
రిలయన్స్ రిటైల్ వ్యాపార నమూనాలో ‘పంచ ప్రాణ్’ ఉన్నాయని అంబానీ చెప్పారు.సాంకేతికతను ఉపయోగించి కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం, బహుళ ఛానెల్‌లను అమలు చేయడం మరియు అభివృద్ధి చేయడం, చిన్న వ్యాపారులతో అనుసంధానం చేయడం, వారు అభివృద్ధి చెందడానికి ఒక వేదికను అందించడం, ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరించడం, లాజిస్టిక్స్ మరియు సరఫరా గొలుసును బలోపేతం చేయడం అని వివరించారు.రాబోయే ఐదేళ్లలో కిరాణా సరుకులను దేశవ్యాప్తంగా చేరవేసే లక్ష్యాన్ని చేరుకుంటామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ చెప్పారు.