దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా అరెస్ట్ చేసిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
ఈ క్రమంలో సిసోడియాను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సిసోడియాకు ఐదు రోజులపాటు కస్టడీ విధించింది.
రేపటి నుంచి మార్చి 4వ తేదీ వరకు కస్టడీకి అనుమతించింది కోర్టు.అనంతరం తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేసింది.