జబర్దస్త్ షో ద్వారా ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్లలో ప్రవీణ్ ఒకరు.తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో ప్రవీణ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.
ఈటీవీ ప్లస్ ఛానల్ లో ప్రసారమవుతున్న పటాస్ షో ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన ప్రవీణ్ ఫైమాతో లవ్ ట్రాక్ వల్ల మరింత పాపులారిటీని సొంతం చేసుకోవడం గమనార్హం.తక్కువ కాలంలోనే ప్రవీణ్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది.
అయితే తాజాగా ప్రవీణ్ ఇంట విషాదం చోటు చేసుకుంది.బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వల్ల ప్రవీణ్ తండ్రి మృతి చెందారు.
ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న ప్రవీణ్ ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోవడం అతని అభిమనులను ఎంతగానో బాధ పెడుతోంది.
బ్రెయిన్ ట్యూమర్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఆయనను వేధిస్తున్నాయని సమాచారం అందుతోంది.
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ప్రవీణ్ కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సమస్యలను చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
ప్రవీణ్ కు ఒక అన్న ఉన్నాడని సమాచారం.ప్రస్తుతం జబర్దస్త్ షోలో ప్రవీణ్ మెయిన్ లీడ్ గా స్కిట్లు ప్రసారమవుతున్నాయి.
ప్రవీణ్ ఫైమా పలు షోలలో పాల్గొంటూ ఒకరిపై ఒకరు మనసులో ఉన్న ప్రేమను వెల్లడిస్తున్నారు.ప్రవీణ్ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రవీణ్ ఈ బాధ నుంచి తేరుకుని మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ప్రవీణ్ సినిమా ఆఫర్లతో కూడా బిజీ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.పటాస్ ప్రవీణ్ కామెడీ టైమింగ్ వెరైటీగా ఉంటుందని ఆయన పంచ్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.